No Snakes Country : ఈ దేశంలో చూద్దామన్నా ఒక్క పాము కనిపించదు.. జూలో కూడా నిషేధం-no snakes country in the world and why snakes banned in this place ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  No Snakes Country : ఈ దేశంలో చూద్దామన్నా ఒక్క పాము కనిపించదు.. జూలో కూడా నిషేధం

No Snakes Country : ఈ దేశంలో చూద్దామన్నా ఒక్క పాము కనిపించదు.. జూలో కూడా నిషేధం

Anand Sai HT Telugu
Apr 23, 2024 12:30 PM IST

No Snakes Country In Telugu : ప్రపంచంలో పాములు లేని ప్రదేశం ఉండదేమోనని మనమంతా అనుకుంటాం. కానీ ఓ దేశంలో అస్సలు ఎంత వెతికినా ఒక్క పాము కూడా కనిపించదు.

పాములు లేని దేశం
పాములు లేని దేశం (Unsplash)

ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. ఈ జీవవైవిధ్యంలో అన్ని జంతువులు, పక్షులకు వాటి స్వంత ప్రాముఖ్యత ఉంది. జీవులు, పర్యావరణం మధ్య సమతుల్యత ఉంటుంది. ఈ ప్రపంచంలో సరిసృపాలు కూడా వాటి పాత్రను అవి పోషిస్తాయి. అందులో పాములు కూడా ఒకటి. ప్రకృతిలో వాటి స్థానం వాటికి ప్రత్యేకంగా ఉంటుంది. కానీ ఒక దేశంలో వాటిపై నిషేధం ఉంది.

పాముల విషయానికొస్తే, అవి మానవులకు ఇబ్బందిని కలిగిస్తాయి. పాములు మానవ మరణాలకు కారణమవుతాయి. మరోవైపు అవి రైతులకు, పర్యావరణానికి చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. పాములు పర్యావరణం నుండి అదృశ్యమైతే అంటే లేకుండా ఉంటే.. అనేక ఇతర సమస్యలతో పాటు పర్యావరణ వ్యవస్థలో గందరగోళం ఏర్పడుతుంది.

పర్యావరణ వ్యవస్థలో సమతుల్యతకు పాముల కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఎలుకలు, కప్పలు వంటి రైతులకు సమస్యను కలిగించే కొన్నింటిని పాములు తింటాయి. మన గ్రహం మీద కనిపించే ప్రమాదకరమైన వాటిలో పాములు కూడా ఒకటి. వర్షాలు ఎక్కువగా కురిసే ప్రదేశాల నుంచి ఎడారుల వరకూ పాములు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే భూమ్మీద ఒక్క దేశంలోనూ పాములు ఉండవు. ఆ దేశం పాము రహితంగా ప్రకటించారు. అవును న్యూజిలాండ్‌ దేశం పాము రహిత దేశంగా ప్రకటించుకుంది. ప్రపంచంలో ఈ విధంగా ప్రకటించిన మొదటి దేశం ఇదే. న్యూజిలాండ్‌లో పాములు ఎందుకు లేవు? అక్కడ పాములు ఏమయ్యాయి?

పాములు తీసుకురావడం నిషేధం

న్యూజిలాండ్ మినహా ప్రపంచంలోని అన్ని చోట్లా పాములు కనిపిస్తాయి. దక్షిణ ధృవానికి సమీపంలో ఉన్న ఈ దేశంలో పాములు ఉండవు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దేశం యొక్క భూభాగం చుట్టూ పాములు కనిపిస్తాయి. ఈ దేశం చుట్టూ సముద్రం ఉంటుంది. కానీ దేశంలో ఎక్కడా పాము కనిపించదు. ఆశ్చర్యకరంగా ఈ దేశంలోని జంతుప్రదర్శనశాలలలో కూడా మీరు పాములను చూడలేరు. పాములను ఉంచడం, విదేశాల నుంచి పాములను తీసుకురావడం కూడా ఇక్కడ నిషేధం. న్యూజిలాండ్‌లో ప్రతి జంతువు, పక్షులకు రక్షణ కోసం చర్యలు తీసుకుంటారు. జంతువుల రక్షణకు ప్రత్యేక చట్టాలున్నాయి.

న్యూజిలాండ్‌లో పాములు ఎందుకు లేవు?

న్యూజిలాండ్ ఒక ద్వీప దేశం. దేశం చుట్టూ సముద్రం ఉంది. చుట్టూ చిన్న ద్వీపాలు ఉన్నాయి. అందువల్ల ఇతర ప్రాంతాల నుండి పాములు ఈ దేశానికి రావు. అలాగే ఈ దేశంలో పాములకు సంబంధించిన ఎటువంటివి కనిపించవు. కాబట్టి పాములు ఈ ద్వీపానికి చేరుకోలేకపోయాయి. పాములు పరాన్నజీవులు.. ఇతర జంతువులను తిని జీవిస్తాయి. మనిషికి కూడా ప్రమాదకరమైనవి. కాబట్టి అక్కడ పాములను ఉంచడం, తీసుకురావడం నిషేధించారు.

పాములు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి?

న్యూజిలాండ్‌లో పాములు కనిపించవు, మరోవైపు ఐర్లాండ్‌లో పాములు కనిపించవు. కానీ బ్రెజిల్‌లో ప్రపంచంలో మరెక్కడా లేనన్ని పాములు ఉన్నాయి. నివేదికల ప్రకారం బ్రెజిల్‌లో 400 కంటే ఎక్కువ జాతుల పాములు కనిపిస్తాయి. బ్రెజిల్‌లో అత్యంత విషపూరితమైన పాములు ఉన్నాయి. అలాగే బ్రెజిలియన్ అనకొండ అతిపెద్ద పాము కూడా ఇక్కడ కనిపిస్తుంది.

WhatsApp channel

టాపిక్