తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Dalit Girl Raped : యూపీలో మైనర్ బాలికపై అత్యాచారం

Dalit Girl raped : యూపీలో మైనర్ బాలికపై అత్యాచారం

HT Telugu Desk HT Telugu

09 October 2022, 10:46 IST

  • Dalit girl raped in Amethi: యూపీలోని అమేథిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మైనర్ బాలికపై అత్యాచారం (ప్రతీతాత్మక చిత్రం)
మైనర్ బాలికపై అత్యాచారం (ప్రతీతాత్మక చిత్రం)

మైనర్ బాలికపై అత్యాచారం (ప్రతీతాత్మక చిత్రం)

girl raped at amethi in uttar pradesh: దేశంలో చిన్నారులపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో మరో కేసు వెలుగుచూసింది. 15 ఏళ్ల మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

పోలీసుల వివరాల ప్రకారం...

జామో ప్రాంతంలో 15 ఏళ్ల దళిత మైనర్ బాలికపై రేప్ జరిగింది. అక్టోబర్ 3వ తేదీన ఈ ఘటన జరిగినట్లు ఫిర్యాదు వచ్చింది. దుర్గామాతా మండపంలో సంగీతం పరికరాలను ఏర్పాటు చేస్తున్న వ్యక్తి... బహిర్భూమికి వెళ్లిన మైనర్ బాలికపై అత్యాచారం జరిపినట్లు ఫిర్యాదులో పేర్కొంంది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీస్ అధికారి అఖిలేశ్ గుప్తా మాట్లాడుతూ... రేప్ ఘటనపై కేసు నమోదు చేశాం. నిందితుడిపై ఐపీసీ 376తో పాటు పోస్కో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిని మోనోగా గుర్తించగా... అతడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

మృతదేహాలు లభ్యం...

ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని ఓ డ్యామ్ నుండి ముగ్గురి మహిళల మృతదేహాలు బయటపడ్డాయి, మధ్యప్రదేశ్ సరిహద్దులోని టికామ్‌ఘర్ జిల్లా నుంచి వారు కొట్టుకుపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతలంతా 25 ఏళ్లలోపుగానే ఉన్నారని పేర్కొన్నారు. పోస్టుమార్టం కోసం తరలిస్తున్నట్లు వెల్లడించింది.