తెలుగు న్యూస్  /  National International  /   Massive Fire Accident Near Mundka Metro Station In Delhi

Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 26 మంది సజీవ దహనం

HT Telugu Desk HT Telugu

13 May 2022, 23:13 IST

    • దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 26 మంది మృతి చెందారు. 30 మందికి పైగా గాయాలు కాగా.. 50 మందిని కాపాడారు.
ఢిల్లీలో అగ్ని ప్రమాదం
ఢిల్లీలో అగ్ని ప్రమాదం ( HT)

ఢిల్లీలో అగ్ని ప్రమాదం

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మూడు అంతస్తులు గల ఓ వాణిజ్య భవనంలో దట్టమైన మంటలు వ్యాపించడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటివరకు 26 మృతదేహాలను గుర్తించగా.. 50 మందికి పైగా ప్రాణాలతో బయటపడ్డారు.  ముండ్కా మెట్రో స్టేషన్‌ సమీపంలోని ఓ భవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

ICSE exam results 2024 : త్వరలో ఐసీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో పలు సంస్థలు కార్యాలయాలను నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సమీర్‌ శర్మ వెల్లడించారు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి

ఈ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేశారు.

టాపిక్