తెలుగు న్యూస్  /  National International  /  Man's Newspaper Ad About Losing His Death Certificate Takes Internet By Storm

`I lost my death certificate` | ‘నా డెత్ సర్టిఫికెట్ పోయింది..’

HT Telugu Desk HT Telugu

23 September 2022, 14:43 IST

    • సోషల్ మీడియాలో వింత వింత వార్తలు రావడం సహజమే. కనీ వినీ ఎరుగని వింతలు కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి. అలాంటి, ఒక ప్రపంచంలోనే తొలిసారి జరిగిన ఒక వింత విషయం ఇది.
తన డెత్ సర్టిఫికెట్ పోయిందంటూ వ్యక్తి ఇచ్చిన పేపర్ యాడ్
తన డెత్ సర్టిఫికెట్ పోయిందంటూ వ్యక్తి ఇచ్చిన పేపర్ యాడ్

తన డెత్ సర్టిఫికెట్ పోయిందంటూ వ్యక్తి ఇచ్చిన పేపర్ యాడ్

`I lost my death certificate` ఈ వింతను ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ ట్విటర్ లో పోస్ట్ చేశారు. క్షణాల్లో వైరల్ అయిన ఈ న్యూస్ కు.. నెటిజన్లు వందలు, వేలల్లో కామెంట్లు, ఇమోజీలు, కామిక్ వీడియోలతో స్పందించారు.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

`I lost my death certificate`: మరణ ధ్రువీకరణ పత్రం

ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ ట్విటర్ లో పోస్ట్ చేసింది ఒక పేపర్ ప్రకటన. అందులో ఒక వ్యక్తి ‘‘నా డెత్ సర్టిఫికెట్ పోయింది.. ఆ సర్టిఫికెట్ సీరియల్ నెంబర్ ఫలానా.. ఎవరికైనా దొరికితే ప్లీజ్ తిరిగివ్వండి’’ అని అభ్యర్థించారు. సాధారణంగా మనిషి చనిపోయిన తరువాతే మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. దాంతో, ఈ పోస్ట్ కు నెటిజన్లు తమ క్రియేటివిటీ అంతా చూపించి కామెంట్లు పెట్టారు. తన పోస్ట్ తో పాటు ‘ఇది ఇండియాలో మాత్రమే జరుగుతుంది’ అని ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ఒక ట్యాగ్ లైన్ కూడా తగిలించారు.

`I lost my death certificate`: ప్రకటన ఇదీ..

‘నా డెత్ సర్టిఫికెట్ ను అస్సాంలోని లుండింగ్ బజార్ లో సెప్టెంబర్ 7, 2022 న ఉదయం 10 గంటలకు పోగొట్టుకున్నాను. ఆ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ 93\18. సీరియల్ నెంబర్ 0068132’ అని రంజిత్ కుమార్ చక్రవర్తి అనే వ్యక్తి ఆ పేపర్ ప్రకటనలో పేర్కొన్నారు.

`I lost my death certificate`: వైరల్ గా..

ఆ ప్రకటన క్షణాల్లో వైరల్ అయింది. నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. నెటిజనుల రెస్సాన్సెస్ లో కొన్ని ఇవి..

‘దొరికితే ఎక్కడికి తెచ్చివ్వాలి బ్రదర్.. నరకానికా? స్వర్గానికా?’

‘ఈ హెల్ప్ మీరు ఎక్కడి నుంచి అడుగుతున్నారు? స్వర్గం నుంచా? నరకం నుంచా?’

‘ఇది ఒక ‘యూడ్ భూత్('Ad-bhoot')’

‘ఎవరో తన డెత్ సర్టిఫికెట్ పోగొట్టుకున్నారు. ఎవరికైనా దొరికితే వెంటనే తిరిగివ్వండి. ఇది చాలా అర్జెంట్. లేదంటే ఆ ఆత్మకు కోపం వస్తుంది’.

‘దీన్ని పెద్ద కామెడీ ఇష్యూ చేయకండి. చనిపోయిన వ్యక్తి కుమారుడు తన తండ్రి పేరుపై ఈ ప్రకటన ఇచ్చి ఉండవచ్చు’