తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Congress President Election Results: కింగ్ కాంగ్రెస్ ఖర్గే

Congress president election results: కింగ్ కాంగ్రెస్ ఖర్గే

HT Telugu Desk HT Telugu

19 October 2022, 14:25 IST

    • Congress president election results: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో కర్నాటకకు చెందిన సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే ఘన విజయం సాధించారు. 
మల్లిఖార్జున్ ఖర్గే (ఫైల్ ఫొటో)
మల్లిఖార్జున్ ఖర్గే (ఫైల్ ఫొటో) (AFP)

మల్లిఖార్జున్ ఖర్గే (ఫైల్ ఫొటో)

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఊహించినట్లే పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే ఘన విజయం సాధించారు. ఖర్గే తో పోటీలో నిలిచిన మాజీ కేంద్ర మంత్రి, కేరళ ఎంపీ శశి థరూర్ ఓటమిని అంగీకరించారు.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Congress president election results: ఎవరికెన్ని ఓట్లు..

అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక జరిగింది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఓట్లను లెక్కించారు. మొత్తం కాంగ్రెస్ డెలిగేట్స్ సంఖ్య 9,385 కాగా, అందులో 7897 ఓట్లను మల్లిఖార్జున్ ఖర్గే సాధించారు. శశి థరూర్ కు 1072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లలేదు. తమ రాష్ట్రానికి చెందిన మల్లిఖార్జున్ ఖర్గే విజయం సాధించడంపై ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో, కర్నాటకలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నాయి.

Congress president election results: గాంధీయేతర అధ్యక్షుడు

దాదాపు 24 ఏళ్ల తరువాత గాంధీ కుటుంబానికి చెందని నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కర్నాటకకు చెందిన మల్లిఖార్జున్ ఖర్గేకు సీనియర్ నాయకుడిగా, పార్టీలో అందరి వ్యక్తిగా, ట్రబుల్ షూటర్ గా పేరుంది. ముఖ్యంగా, పార్టీలో గాంధీ కుటుంబానికి విధేయుడైన నాయకుడు. అన్ని రాష్ట్రాల్లోని నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్న నాయకుడిగా ఖర్గే కు పేరుంది. 2024 లోక్ సభ ఎన్నికలకు ఖర్గే నేతృత్వంలోనే కాంగ్రెస్ పోరాడనుంది.