తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mahindra Scorpio Classic : మహీంద్రా స్కార్పియో క్లాసిక్​ ధర ఎంతంటే..

Mahindra Scorpio Classic : మహీంద్రా స్కార్పియో క్లాసిక్​ ధర ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

20 August 2022, 15:09 IST

google News
    • Mahindra Scorpio Classic price : మహీంద్రా స్కార్పియో క్లాసిక్​ ధరను ప్రకటించింది సంస్థ. ఆ వివరాలు..
మహీంద్రా స్కార్పియో క్లాసిక్​ ధర ఎంతంటే..
మహీంద్రా స్కార్పియో క్లాసిక్​ ధర ఎంతంటే..

మహీంద్రా స్కార్పియో క్లాసిక్​ ధర ఎంతంటే..

Mahindra Scorpio Classic price : మహీంద్రా స్కార్పియో క్లాసిక్​ ధరను ఎట్టకేలకు ప్రకటించింది మహీంద్రా అండ్​ మహీంద్రా. ఈ ఎస్​యూవీకి చెందిన ‘ఎస్’​ వేరియంట్​ ఎక్స్​ షోరూం ధర రూ. 11.99 లక్షలు. మహీంద్రా స్కార్పియో క్లాసిక్​ ‘ఎస్​11’ మోడల్​ ధర రూ. 15.49లక్షలు.

సరికొత్త లుక్​తో వస్తున్న మహీంద్రా స్కార్పియో క్లాసిక్​ ఎస్​యూవీ.. రెడ్​ రేజ్​, సిల్వర్​, నెపోలి బ్లాక్​, పర్ల్​ వైట్​, గాలెక్సీ గ్రే రంగుల్లో అందుబాటులోకి వస్తుంది.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్​ ఫీచర్లు..

మహీంద్రా స్కార్పియో క్లాసిక్​లో 9 ఇంచ్​ ఇన్పోటైన్​మెంట్​ స్క్రీన్​ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్​ బేస్డ్​ టచ్​ స్క్రీన్​. డాష్​బోర్డుకు ఉడెన్​ స్టైల్​ డిజైన్​ లభిస్తోంది. స్ట్రీరింగ్​కి లెథరెట్​ ఫినిష్​ ఇస్తున్నారు.

ఈ సరికొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్​లో ఫుల్లీ ఆటోమేటిక్​ క్లైమేట్​ కంట్రోల్​ సిస్టమ్​ ఉంది. డ్యూయెల్​ టోన్​ కలర్​ స్కీమ్​ ఉంది. ఫ్రంట్​- రేర్​ ఆర్మ్​రెస్ట్​, సన్​గ్లాస్​ హోల్డర్​, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టెబుల్​ వింగ్​ మిర్రర్స్​, ప్రొజెక్టర్​ హెడ్​ల్యాంప్స్​ ఉన్నాయి.

Mahindra Scorpio Classic : మహీంద్రా స్కార్పియో క్లాసిక్​లో 7 సీటర్​, 9 సీటర్​ వేరియంట్లు ఉన్నాయి.

కొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 17-అంగుళాల రీడిజైన్ చేసిన డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌పై కూర్చుంది. ఎస్​యూవీ వెనుక భాగంలో సిగ్నేచర్ స్కార్పియో టవర్ ఎల్​ఈడీ టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి.

మహీంద్రా రాబోయే స్కార్పియో క్లాసిక్‌లో సరికొత్త 2.2-లీటర్ జెన్​-2 ఎంహాక్​ డీజిల్ ఇంజన్‌ను అందిస్తున్నారు. ఈ కొత్త పవర్‌ట్రెయిన్ 132 పీఎస్​ పవర్ అవుట్‌పుట్, 300 ఎన్​ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ కొత్త ఇంజన్ పాత వెర్షన్ కంటే 50 శాతం తేలికైనదని, మెరుగైన మైలేజీని కూడా అందిస్తుందని మహీంద్రా కంపెనీ పేర్కొంది.

ఎస్​యూవీ సెగ్నెంట్​లో విప్లవం సృష్టించే దిశగా మహీంద్రా అండ్​ మహీంద్రా పరుగులు తీస్తోంది. ఇప్పటికే స్కార్పియో ఎన్​ను ప్రకటించింది. సెప్టెంబర్​ చివరి నుంచి డెలివరీ మొదలవుతుంది.

ఇక ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్నెంట్​లోనూ జోరు పెంచింది మహీంద్రా. 2024 చివరి నాటికి ఐదు ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలను మార్కెట్​లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం