Mahindra Scorpio N : నేటి నుంచి స్కార్పియో- ఎన్​ బుకింగ్స్​ షురూ-mahindra scorpio n bookings to start today 30th july 2022 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Mahindra Scorpio-n Bookings To Start Today 30th July 2022

Mahindra Scorpio N : నేటి నుంచి స్కార్పియో- ఎన్​ బుకింగ్స్​ షురూ

Sharath Chitturi HT Telugu
Jul 30, 2022 07:44 AM IST

Mahindra Scorpio N bookings: మహీంద్రా అండ్​ మహీంద్రా.. గత నెలలో స్కార్పియో- ఎన్​ను లాంచ్​ చేసింది. కాగా.. శనివారం నుంచి బుకింగ్స్​ ప్రారంభంకానున్నాయి.

స్కార్పియో ఎన్​
స్కార్పియో ఎన్​ (Mint)

Mahindra Scorpio N bookings: నేటి నుంచి స్కార్పియో- ఎన్​ బుకింగ్స్​ ప్రారంభమవుతాయని మహీంద్రా అండ్​ మహీంద్రా ప్రకటించింది. రూ. 21,000తో బుకింగ్స్​ చేసుకోవచ్చు. స్కార్పియో- ఎన్​ మోడల్​ను గత నెలలో లాంచ్​ చేసింది ఎం అండ్​ ఎం. రానున్న పండుగ సీజన్​ను దృష్టిలో పెట్టుకుని, సెప్టెంబర్​ చివరి వారం నుంచి డెలివరీని మొదలుపెట్టనుంది.

మహీంద్రా స్కార్పియో- ఎన్​లో మొత్తం ఐదు వేరియంట్లు ఉంటాయి. అవి జెడ్​2, జెడ్​4, జెడ్​6, జెడ్​8, జెడ్​8ఎల్​. కొత్త స్కార్పియో.. పెట్రోల్​, డీజిల్​ వేరియంట్లలో లభిస్తుంది. మ్యాన్యువల్​- ఆటోమెటిక్​ ట్రాన్స్​మీషన్​ వెసులుబాటు కూడా ఉంది.

జెడ్​4 పెట్రోల్​ వేరియంట్​ ధర రూ. 15.45లక్షలుగా ఉంది. ఇక జెడ్​8ఎల్​ డీజిల్​ వేరియంట్​ ధర రూ. 21.45లక్షలుగా ఉంది.

"జులై 30 నుంచి స్కార్పియో- ఎన్​ బుకింగ్స్​ ప్రారంభమవుతాయి. 2022 డిసెంబర్​ నాటికి 20వేల యూనిట్లు డెలివరీ చేసేందుకు ప్రణాళికలు రచించాము. కస్టమర్ల ట్రెండ్​ని చూసి.. జెడ్​8ఎల్​కు అధిక ప్రాధాన్యతనిస్తున్నాము," అని ఎం అండ్​ ఎం వెల్లడించింది.

సెఫ్టీ ఫీచర్స్​లో భాగంగా.. స్కార్పియో- ఎన్​లో ఆరు ఎయిర్​బ్యాగ్స్​, డ్రైవర్​ నిద్రమత్తులో ఉంటే అలర్ట్​ చేసే వ్యవస్థ వంటి సదుపాయాలు ఉన్నాయి.

టాటా సఫారీ, హుందాయ్​ క్రేటా, టయోటా ఫార్చ్యూనర్​ వంటి ఎస్​యూవీలకు స్కార్పియో- ఎన్​ గట్టి పోటీని ఇస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

స్కార్పియో- ఎన్​.. ఒక గేమ్​ ఛేంజర్​ అని మహీంద్రా అండ్​ మహీంద్రా భావిస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్