తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  New Cds: కొత్త సీడీఎస్ గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్

New CDS: కొత్త సీడీఎస్ గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్

HT Telugu Desk HT Telugu

28 September 2022, 19:31 IST

  • New CDS: దాదాపు తొమ్మిది నెలల విరామం అనంతరం కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.

లెఫ్ట్ నెంట్ జనరల్ అనిల్ చౌహాన్
లెఫ్ట్ నెంట్ జనరల్ అనిల్ చౌహాన్

లెఫ్ట్ నెంట్ జనరల్ అనిల్ చౌహాన్

New CDS: ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) ను నియమించింది. 9 నెలల క్రితం నాటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) జనరల్ బిపిన్ రావత్ హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించిన నాటి నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

New CDS: కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS)

తాజాగా, బుధవారం కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) ను ప్రభుత్వం నియమించింది. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ ను కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) గా నియమించింది. ఈ మేరకు రక్షణ శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ సీడీఎస్ గానే కాకుండా, కేంద్ర ప్రభుత్వ మిలటరీ వ్యవహారాల విభాగం కార్యదర్శిగా కూడా విధులు నిర్వర్తిస్తారు.

New CDS: 40 ఏళ్ల కెరియర్

లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ భారతీయ సైన్యంలోని వివిధ విభాగాల్లో దాదాపు 40 ఏళ్ల పాటు సేవలను అందించారు. జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో పలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను విజయవంతంగా అమలు చేశారు. దేశంలోని పలు మిలటరీ కేంద్రాల నిర్వహణలో పాలు పంచుకున్నారు. రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ భారతదేశ రెండో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS). తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్.