తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Live News Today: పేదలను మోసం చేయడమే కాంగ్రెస్ వ్యూహం: ప్రధాని మోదీ విమర్శలు
అజ్మీర్‌ సభలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
అజ్మీర్‌ సభలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ (PTI)

Live News Today: పేదలను మోసం చేయడమే కాంగ్రెస్ వ్యూహం: ప్రధాని మోదీ విమర్శలు

31 May 2023, 13:57 IST

  • Live News - Latest Updates Today:  నేటి జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఇక్కడ తెలుసుకోండి. లేటెస్ట్ అప్‍డేట్ల కోసం ఈ లైవ్ పేజీని ఫాలో అవండి. 

31 May 2023, 18:25 IST

భారత్ విజయాలను కొందరు జీర్ణించుకోలేకున్నారు: ప్రధాని మోదీ

భారత దేశం సాధిస్తున్న విజయాలను కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలను విమర్శించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. పార్లమెంటు కొత్త భవనంపై కూడా రాజకీయాలు చేశారని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు రాజస్థాన్‍లోని అజ్మీర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. 

31 May 2023, 17:46 IST

పేదలను మోసం చేయడమే కాంగ్రెస్ వ్యూహం: ప్రధాని మోదీ విమర్శలు

రాజస్థాన్‍లోని అజ్మీర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రసంగించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సభ జరిగింది. బీజేపీ ప్రభుత్వ విజయాలను ప్రజలకు మోదీ వివరించారు. అలాగే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. 50 ఏళ్ల క్రితమే గరీబీ హఠావో అంటూ కాంగ్రెస్ నినాదం ఇచ్చిందని, అయినా పేదల కోసం ఏమీ చేయలేదని మోదీ అన్నారు. పేదలను మోసం చేస్తూ ఉండడమే ఆ పార్టీ వ్యూహమని విమర్శించారు. 2014కు ముందు దేశం అన్ని రంగాల్లో వెనుకబడిందని మోదీ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు మేలు చేశామని, ప్రపంచమే భారత్‍ను ప్రశంసిస్తోందని చెప్పారు. 

31 May 2023, 17:07 IST

కారు ప్రమాదం.. కొత్త దంపతులతో పాటు మరో ఇద్దరి మృతి

మధ్యప్రదేశ్‍లోని హర్దా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్టు ఢీకొట్టిన తర్వాత కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న కొత్తగా పెళ్లయిన జంటతో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. 

31 May 2023, 16:39 IST

బ్రహ్మ దేవాలయంలో ప్రధాని మోదీ పూజలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రాజస్థాన్ చేరుకున్నారు. పుష్కర్‌లోని బ్రహ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ప్రదక్షిణలు చేశారు. అజ్మీర్‌లో జరిగే సభలో మోదీ ప్రసంగించనున్నారు. 

31 May 2023, 15:59 IST

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. ఎస్ఎస్ఈ నిఫ్టీ 99.45 పాయింట్ల నష్టంతో 18,534.40 పాయింట్ల వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 346.86 పాయింట్లు కోల్పోయి 62,622.24 వద్ద ముగిసింది. ఐటీ, రియల్టీ, హెల్త్ కేర్ మినహా మిగిలిన సెక్లార్ల సూచీలన్నీ నష్టపోయాయి. 

31 May 2023, 15:36 IST

ఢిల్లీ చేరుకున్న నేపాల్ ప్రధాని

నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ.. భారత పర్యటనకు వచ్చారు. ఢిల్లీలో ఆయనకు కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్వాగతం పలికారు. 

31 May 2023, 15:05 IST

ఆ ఐదు హమీలను ఎఅమలు చేసేందుకు నిర్ణయించాం: సీఎం

ఎన్నికలకు ముందు ఇచ్చిన ఐదు హామీలను నెరవేర్చేందుకు నిర్ణయించుకున్నామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బెంగళూరులో అన్నారు. ఈ నెల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 

31 May 2023, 14:27 IST

ఒక్క ఆరోపణ నిజమైనా ఉరేసుకుంటా: బ్రిజ్ భూషణ్ 

తనపై వచ్చిన ఒక్క ఆరోపణ నిజమైనా స్వయంగా తనకు తానే ఉరేసుకుంటానని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను అరెస్ట్ చేయాలని రెజర్లు తీవ్రమైన ఆందోళనలు చేస్తున్నారు. 

31 May 2023, 13:57 IST

బ్రిజ్ భూషణ్‍ను అరెస్ట్ చేసేందుకు ఆధారాలు లేవు: ఢిల్లీ పోలీసులు

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్‍పై ఎఫ్ఐఆర్ నమోదైనా.. ఆరోపణలను బలపరుస్తూ ఎలాంటి ఆధారాలు లేవని, అందుకే ఆయనను అరెస్ట్ చేయలేదని ఢిల్లీ పోలీసులు వర్గాలు వెల్లడించాయి. లైగింక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‍పై చర్యలు తీసుకోవాలని రెజర్లు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. 

31 May 2023, 13:27 IST

స్కూటర్‌ను ఢీకొట్టి లాక్కెళ్లిన కారు.. నలుగురు మృతి

లక్నోలోని అలీగంజ్ సమీపంలో ఓ స్కూటర్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు.  

31 May 2023, 13:57 IST

ఓటీటీల్లోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు

ఇప్పటి నుంచి ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో కూడా పొగాకు వ్యతిరేక హెచ్చరికలను ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పొగాకు వాడకం వల్ల కలిగే దుష్ప్రయోజనాలను తెలిపేలా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లు కూడా వార్నింగ్ మెసేజ్‍లు చూపించాలని కేంద్ర  వైద్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

31 May 2023, 11:57 IST

రెజ్లర్లకు కవిత మద్దతు

ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రెజర్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్దతు తెలియజేశారు. మహిళా రెజ్లర్ల కృషి, అంకితభావం, దేశభక్తి.. భారత ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పాయని ట్వీట్ చేశారు. 5 రోజుల్లోగా రెజర్ల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పోక్సో వంటి తీవ్రమైన అభియోగాలు వచ్చినా బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‍పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్రం సమాధానాన్ని దేశమంతా కోరుకుంటోందని కవిత పేర్కొన్నారు. 

31 May 2023, 11:40 IST

ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకున్న ఆర్మీ

పాకిస్థాన్ నుంచి అక్రమంగా దేశంలోకి చొరబడిన ముగ్గురు ఉగ్రవాదులను జమ్ము కశ్మీర్‌లో భారత ఆర్మీ సిబ్బంది పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 

31 May 2023, 11:12 IST

రియల్‍మీ 11 ప్రో సిరీస్ లాంచ్ డేట్ ఖరారు

ఇండియాలో రియల్‍మీ 11 ప్రో సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్ అయింది. జూన్ 8వ తేదీన భారత్‍లో రియల్‍మీ 11 ప్రో, రియల్‍మీ 11 ప్రో+ మొబైళ్లు విడుదల కానున్నాయి. 

31 May 2023, 10:50 IST

భారత్ జోడో యాత్రను అడ్డుకోవాలని ప్రభుత్వం చూసింది: అమెరికాలో రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ.. అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా కాలిఫోర్నియాలోని ఓ కార్యక్రమంలో మాట్లాడారు. తాను చేసిన భారత్ జోడో యాత్రను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం శాయశక్తులా అన్ని ప్రయత్నాలు చేసిందని, కానీ ఏవీ పని చేయలేదని రాహుల్ అన్నారు. దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తూ చాలా మందిని బీజేపీ బెదిరిస్తోందని ఆయన అన్నారు. 

31 May 2023, 10:14 IST

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈ నిఫ్టీ 58.85 పాయింట్ల నష్టంతో 18,575 వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 240.85 పాయింట్లు పడిపోయి 62,728.28 వద్ద కొనసాగుతున్నాయి.  

31 May 2023, 9:55 IST

రాజస్థాన్‍లో నేడు ప్రధాని భారీ సభ

రాజస్థాన్‍లో  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు మెగా బహిరంగ సభలో పాల్గొనున్నారు. మోదీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు నిండిన సందర్భంగా అజ్మీర్‌లో ఈ సభ జరగనుంది. ప్రధాని మోదీ ఈ సభలో.. కేంద్ర ప్రభుత్వ విజయాల గురించి ప్రజలకు వివరించనున్నారు. ఈ ఏడాదే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. 

31 May 2023, 9:54 IST

తగ్గిన బంగారం ధరలు

దేశీయ మార్కెట్‍లో బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100 తగ్గి రూ.55,450కు, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.110 దిగొచ్చి రూ.60,490కు చేరింది. 

31 May 2023, 9:54 IST

మూడు రోజులు ప్లాన్ చేసి చంపాడు! 

ఢిల్లీలో 16 ఏళ్ల యువతిని సాహిల్ అనే యువకుడు  నడివీధిలో కిరాతకంగా హత్య చేసిన కేసులో మరిన్ని విషయాలు బయటికి వచ్చాయి. ఈ హత్య కోసం మూడు రోజులుగా సాహిల్ ప్లాన్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. గురువారం నుంచి ప్లాన్ చేసి.. ఆదివారం ఆ అమ్మాయిని సాహిల్ చంపినట్టు పోలీసులు తెలిపారు. వారిద్దరి మధ్య గురువారం గొడవ జరిగిందని పోలీసుల విచారణ వెల్లడైంది. అప్పటి నుంచి ఆ అమ్మాయిపై సాహిల్ తీవ్రమైన ఆగ్రహంగా ఉండి.. చివరికి హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది. 

    ఆర్టికల్ షేర్ చేయండి