తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Russia-ukraine Crisis | ఉక్రెయిన్‌ సరిహద్దులో భారీగా రష్యన్‌ ఫైటర్‌ జెట్స్‌

Russia-Ukraine Crisis | ఉక్రెయిన్‌ సరిహద్దులో భారీగా రష్యన్‌ ఫైటర్‌ జెట్స్‌

Hari Prasad S HT Telugu

19 February 2022, 13:17 IST

    • రష్యా చెబుతున్నది ఒకటి.. ఉక్రెయిన్‌ సరిహద్దులో జరుగుతున్నది మరొకటి అని తాజా శాటిలైట్‌ ఫొటోలతో మరోసారి రుజువైంది. భారీగా అటాక్‌ హెలికాప్టర్లు, ఫైటర్‌ జెట్లు మోహరించినట్లు ఈ హై రెజల్యూషన్‌ ఇమేజెస్ బయటపెట్టాయి.
క్రిమియాలోని డోనుజ్లావ్ సరస్సు ప్రాంతంలో రష్యా మోహరించిన హెలికాప్టర్లను ఈ మక్సర్ శాటిలైట్ ఫొటోలో చూడొచ్చు
క్రిమియాలోని డోనుజ్లావ్ సరస్సు ప్రాంతంలో రష్యా మోహరించిన హెలికాప్టర్లను ఈ మక్సర్ శాటిలైట్ ఫొటోలో చూడొచ్చు (REUTERS)

క్రిమియాలోని డోనుజ్లావ్ సరస్సు ప్రాంతంలో రష్యా మోహరించిన హెలికాప్టర్లను ఈ మక్సర్ శాటిలైట్ ఫొటోలో చూడొచ్చు

కీవ్‌: ఉక్రెయిన్‌ సరిహద్దు నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు రష్యా పదే పదే ప్రకటిస్తోంది. ఈ సమస్యపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ చెబుతున్నారు. అయితే రష్యా, ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో మాత్రం పరిస్థితి మరోలా ఉన్నట్లు తాజాగా స్పష్టమైంది. 

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం ఖాయమని అమెరికా చెబుతున్నట్లుగానే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నట్లు తేలింది. హైరెజల్యూషన్‌ శాటిలైట్‌ ఫొటోలు రష్యా అసలు బండారాన్ని బయటపెట్టాయి. ఈ ఫొటోలు గత కొన్ని రోజులుగా తీసినవి. ఉక్రెయిన్‌కు సమీపంగా కొన్ని వ్యూహాత్మక ప్రదేశాలకు రష్యా తమ మిలిటరీని తరలించినట్లు ఈ ఫొటోలను చూస్తే స్పష్టమవుతోంది. 

బెలారస్‌, క్రిమియా, పశ్చిమ రష్యా ప్రాంతాల్లో రష్యా మిలిటరీ కార్యకలాపాలు పెరిగినట్లు కూడా తేలింది. ఎటు చూసినా అటాక్‌ హెలికాప్టర్లు, ఫైటర్‌ జెట్లు దాడికి సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు రష్యా మాత్రం తాము ఉక్రెయిన్‌పై దాడి చేయబోమని, అయితే ఆ దేశం నాటోలో చేరకూడదని డిమాండ్‌ చేస్తోంది. రష్యా 2014లోనే క్రిమియాలోని వేర్పాటువాదులకు మద్దతుగా నిలిచి.. ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న విషయం తెలిసిందే.