తెలుగు న్యూస్  /  National International  /  Kerala Nurse, Two Children Killed In Uk; Husband Held: Police

Indian woman killed in UK: ఇంగ్లండ్ లో భారతీయ యువతి దారుణ హత్య; పిల్లలు కూడా..

HT Telugu Desk HT Telugu

17 December 2022, 23:23 IST

  • Indian woman killed in UK: ఇంగ్లండ్ లో భారత్ కు చెందిన ఒక యువతి హత్యకు గురైంది. తన అపార్ట్ మెంట్లో కత్తి పోట్ల గాయాలతో విగత జీవిగా కనిపించింది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Indian woman killed in UK: ఇంగ్లండ్ లో, లండన్ కు దాదాపు 100 కిమీల దూరంలోని నార్తంప్టన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. భారతీయ మహిళతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు కూడా హత్యకు గురయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

ICSE exam results 2024 : త్వరలో ఐసీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

Indian woman stabbed to death in UK:కేరళ నర్సు

యూకేలోని నార్తంప్టన్ ప్రాంతంలోని కెట్టెరింగ్ లో ఉన్న తమ అపార్ట్ మెంట్లో భారత్ కు చెందిన మహిళ హత్యకు గురైంది. కేరళకు చెందిన అంజు అనే 42 ఏళ్ల నర్సును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆమెతో పాటు అపార్ట్ మెంట్లో ఆమె ఇద్దరు పిల్లలు కూడా కత్తి పోటు గాయాలతో, తీవ్ర రక్తస్రావమై, అపస్మారక స్థితిలో కనిపించారు. అనంతరం, ఆ పిల్లలిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

Husband in police custody: పోలీసుల అదుపులో భర్త

యూకేలో నర్స్ గా విధుల్లో ఉన్న 42 ఏళ్ల వయస్సున్న అంజు కేరళ లోని కొట్టాయం నుంచి బ్రిటన్ కు వెళ్లింది. అక్కడే భర్త సజు, ఆరు సంవత్సరాలు, నాలుగు సంవత్సరాల వయస్సున్న ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. ఇద్దరు పిల్లలతో పాటు అంజు హత్యకు గురికావడంతో, మొదట ఆమె భర్త సజును పోలీసులు అదుపులోకి తీసుకుని, ప్రశ్నిస్తున్నారు. సజు శరీరంపై కూడా స్వల్ప గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. త్వరలోనే దోషులను పట్టుకుంటామని నార్తంప్టన్ పోలీస్ చీఫ్ స్టీవ్ ఫ్రీమన్ తెలిపారు. శుక్రవారం ఉదయం 11.15 గంటల సమయంలో వారి అపార్ట్ మెంట్ నుంచి అరుపులు వినిపించాయని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు.

Parents in Kerala: భర్త కోపిష్టే కానీ..

కొట్టాయంలోని అంజు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దాంతో, వారు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ బిడ్డ అంజు భర్త సజు కోపిష్టే కానీ, హత్యలు చేసేంత దారుణానికి ఒడిగడ్తాడని తాము భావించడం లేదని అంజు తండ్రి అశోకన్ తెలిపారు. అంజు రెండేళ్ల క్రితమే యూకే వెళ్లిందన్నారు. అంజుకి కన్నూర్ కు చెందిన సజుతో 2012లో వివాహం జరిగిందన్నారు. సజు మొదట్లో సౌదీలో పని చేసేవాడని వెల్లడించారు.

టాపిక్