తెలుగు న్యూస్  /  National International  /  India's Longest Train, Vivek Express, To Operate Twice A Week

India's longest train, Vivek Express: భారత్ లో అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఇదే

HT Telugu Desk HT Telugu

19 November 2022, 21:56 IST

  • India's longest train, Vivek Express: అటు అస్సాంను, ఇటు తమిళనాడును కలిపే రైలు ఇది. భారతదేశంలో అత్యధిక దూరం ప్రయాణించే ట్రైన్ ఇది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Northeast Frontier Railway: అస్సాం నుంచి తమిళనాడు వరకు.. తొమ్మిది రాష్ట్రాల్లో, 4,189 కిలోమీటర్లు ప్రయాణించే వివేక్ ఎక్స్ ప్రెస్ విషయంలో మరో శుభవార్త ను నార్తీస్ట్ ఫ్రంటీర్ రైల్వే(Northeast Frontier Railway NFR) ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

ICSE exam results 2024 : త్వరలో ఐసీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

This Train covers 9 states: 9 రాష్ట్రాలను..

వివేక్ ఎక్స్ ప్రెస్ అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి దక్షిణ కొనన ఉన్న తమిళనాడులోని కన్యాకుమారి వరకు ప్రయాణిస్తుంది. ఈ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ప్రయాణించే దూరం 4,189 కిలో మీటర్లు. మొత్తం 9 రాష్ట్రాలను కవర్ చేస్తుంది. మొత్తం ప్రయాణ సమయం 80 గంటలు.

Twice a week: ఇకపై వారానికి రెండు రోజులు

ఈ దిబ్రూగఢ్- కన్యాకుమారి ఎక్స్ ప్రెస్ రైలు 2011 నవంబర్ 19న ప్రారంభమైంది. అంటే సరిగ్గా 11 సంవత్సరాల క్రితం ఈ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. అయితే, ఇప్పటివరకు ఈ రైలు వారానికి ఒకసారి మాత్రమే సేవలను అందించేంది. దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారికి వెళ్లే వివేక్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ నెంబ 15906 గతంలో ప్రతీ శనివారం మాత్రమే ప్రయాణం ప్రారంభించేది. ఇకపై ఇకపై, నవంబర్ 22, 2022 నుంచి ఈ వివేక్ ఎక్స్ ప్రెస్ వారానికి రెండు రోజులు, అంటే, శనివారంతో పాటు మంగళవారం కూడా ప్రారంభమవుతుందని NFR శనివారం ప్రకటించింది. అలాగే, కన్యాకుమారిలో ప్రారంభమై దబ్రూగఢ్ కు వెళ్లే ట్రైన్ నెంబర్ 15905, ఇకపై గురువారం తో పాటు, ఆదివారం కూడా సేవలను అందిస్తుందని తెలిపింది.

టాపిక్