తెలుగు న్యూస్  /  National International  /  Indian Army Recruitment 2023 Apply For Ssc Course 93 Posts To Offer

Indian Army Recruitment 2023: 93 పోస్టులకు ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu

16 January 2023, 13:09 IST

    • Indian Army Recruitment 2023: ఇండియన్ ఆర్మీ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. 93 పోస్టుల భర్తీకి గాను ఈ జాబ్ నోటిఫికేషన్ జారీ చేసింది.
Indian Army Recruitment 2023: Apply for SSC course, 93 posts to offer
Indian Army Recruitment 2023: Apply for SSC course, 93 posts to offer

Indian Army Recruitment 2023: Apply for SSC course, 93 posts to offer

షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సుకు సంబంధించి ఇండియన్ ఆర్మీ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అవివాహితులైన పురుష, మహిళ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, అలాగే భారత సాయుధ బలగాల్లో పనిచేసి మరణించిన సైనిక సిబ్బంది భార్యలు జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

ICSE exam results 2024 : త్వరలో ఐసీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఇండియన్ ఆర్మీ 93 పోస్టులను భర్తీ చేస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 11నే ప్రారంభమైంది. ఫిబ్రవరి 9కి ముగుస్తుంది. ఈ రిక్రూట్మెంట్‌లో భాగంగా ఎస్ఎస్‌సీ (టెక్ ) 63 పోస్టులు (మెన్), ఎస్ఎస్‌సీడబ్ల్యూ (టెక్) 32 పోస్టులు (మహిళ) భర్తీ చేస్తారు.

అర్హతలు ఇవే..

ఎస్ఎస్‌సీ పోస్టులకు అభ్యర్థులు ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి లేదా.. చివరి సంవత్సరం చదువుతున్న వారై ఉండాలి. ఎస్ఎస్‌సీడబ్ల్యూ పోస్టులకు నాన్ టెక్నికల్ అయితే ఏదైనా డిగ్రీ, టెక్నికల్ అయితే బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.

ఎస్ఎస్‌సీ టెక్ పోస్టులకు వయో పరిమితి 20 నుంచి 27గా నిర్దేశించారు. వితంతువులైతే గరిష్ట వయోపరిమితి అక్టోబరు 1, 2023 నాటికి 35 సంవత్సరాలుగా నిర్దేశించారు.

ఎంపిక ప్రక్రియ

ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. రెండో దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ దశలో ఎంపికైన వారు వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.