తెలుగు న్యూస్  /  National International  /  House Rent In London Goes Up To Record <Span Class='webrupee'>₹</span>3 Lakh Per Month.

House rent 3 lakhs per month: నెలకు 3 లక్షల రూపాయల ఇంటి అద్దెనా? టూ మచ్ అక్కడ..

HT Telugu Desk HT Telugu

28 January 2023, 15:46 IST

    • House rent 3 lakhs per month: జీవన వ్యయం విషయంలో అంతర్జాతీయంగా నెంబర్ 1 స్థానంలో ఎప్పుడూ ఉండేది బ్రిటన్ రాజధాని లండన్ నగరమే. తాజాగా, అక్కడ ఇంటి అద్దెలు కూడా సామాన్యుడు భరించలేని స్థాయికి చేరాయి.
లండన్ లోని బిగ్ బెన్
లండన్ లోని బిగ్ బెన్

లండన్ లోని బిగ్ బెన్

House rent 3 lakhs per month: లండన్ మహా నగరంలో ఇంటి అద్దెలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రస్తుతం లండన్ ల నెలవారీ ఇంటి అద్దె మన కరెన్సీలో రూ. 3 లక్షలకు చేరింది.

ట్రెండింగ్ వార్తలు

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

House rent 3 lakhs per month: ఇంకా పెరగొచ్చు..

లండన్ లో ఇళ్ల యజమానులు రూ. 3 లక్షల నెలవారీ అద్దె డిమాండ్ చేస్తున్నారని అక్కడి మీడియా కథనాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంటి రెంట్ భారం మరింత పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ భారీగా ఉన్నవిద్యుత్ చార్జీలు, ఇతర నిత్యావసర ఖర్చులకు తోడు ఇంటి అద్దె భారం కూడా తోడవడంతో లండన్ లో జన జీవనం అత్యంత ఖరీదైనదిగా మారింది. టెలీగ్రాఫ్ పత్రిక కథనం ప్రకారం.. లండన్ లో సగటున నెల ఇంటి అద్దె గత సంవత్సరం డిసెంబర్ లో రూ. 2.5 లక్షలకు చేరింది.

House rent 3 lakhs per month: పార్కింగ్ ప్లేస్ లకు కూడా డిమాండ్

లండన్ శివార్లలో కాకుండా, ఇన్నర్ లండన్ లో నెలవారీ సగటు ఇంటి రెంట్ రూ. 3 లక్షలకు చేరింది. ఈ స్థాయిలో రెంట్స్ పెరగడం ఇదే ప్రథమం. గతంలో ఎప్పుడు లేనంత స్థాయిలో 2021, 2022 ల్లో లండన్ లో ఇంటి అద్దెలు పెరిగాయి. 2021 లో ఇంటి అద్దెలో వార్షిక సగటు పెరుగుదల 9.9% కాగా, 2022లో అది 9.7% అని టెలీగ్రాఫ్ తెలిపింది. గరిష్టంగా పెరిగిన ఇంటి అద్దెలు చెల్లించలేకపోతుండడంతో, లండన్ లో చాలా ఇళ్లు ఖాళీగా ఉంటున్నాయని అక్కడి ప్రాపర్టీ డీలర్లు చెబుతున్నారు. చవకైన ఇళ్ల కోసం చాలామంది శివారు ప్రాంతాలకు వెళ్తున్నారని ప్రాపర్టీ డీలింగ్ సైట్ ‘రైట్ మూవ్’ తెలిపింది. ఇటీవల లండన్ లోని ఒక బ్యాంకర్ తూర్పు లండన్ లోని డాల్స్ టన్ లో ఉన్న తన ఇంటిలోని రెండు పార్కింగ్ ప్లేసెస్ ను ఆరేళ్ల పాటు రెంట్ కు ఇస్తానని అగ్రిమెంట్ చేసుకుని రూ. 7 లక్షలు సంపాదించాడని స్థానిక మెట్రో న్యూస్ ప్రచురించింది.