తెలుగు న్యూస్  /  National International  /  Hc Quashes Kerala Govt Order To Ban Plastic Carry Bags

ban on plastic: ప్లాస్టిక్ నిషేధంపై రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు

HT Telugu Desk HT Telugu

10 January 2023, 20:35 IST

    • ban on plastic: ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నిషేధిస్తూ కేరళ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను కేరళ హైకోర్టు కొట్టేసింది.  HC quashes Kerala Govt order to ban plastic carry bags
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ban on plastic: చదరపు మీటరుకు 60 గ్రాముల కన్నా తక్కువ బరువున్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ (ban on plastic carry bags) లను కేరళ ప్రభుత్వం నిషేధించింది. ఈ నిషేధాన్ని సవాలు చేస్తూ కేరళలోని వ్యాపార సంఘాలు కేరళ హై కోర్టును ఆశ్రయించాయి. ఆ పిటిషన్లను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నగరేశ్ మంగళవారం తీర్పును వెలువరించారు.

ట్రెండింగ్ వార్తలు

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

ICSE exam results 2024 : త్వరలో ఐసీఎస్​ఈ ఫలితాలు- ఇలా చెక్​ చేసుకోండి..

Miss Universe: మిస్ యూనివర్స్ బ్యూనోస్ ఎయిర్స్ పోటీలో విజేతగా నిలిచింది ఒక 60 ఏళ్ల మోడల్..

ban on plastic: బ్యాన్ కుదరదు

ప్లాస్టిక్ ఉత్పత్తులను (ban on plastic carry bags) నిషేధించడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని హై కోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం చేసిన పలు సవరణలను ప్రస్తావించింది. చదరపు మీటరుకు 60 గ్రాముల కన్నా తక్కువ బరువున్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ (ban on plastic carry bags) లను కేరళ ప్రభుత్వం 2022 జనవరి 1నుంచి నిషేధించింది. ఈ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధించడం ప్రారంభించింది. ఈ నిషేధంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్స్, కప్స్, గార్బేజ్ బ్యాగ్స్, జ్యూస్ ప్యాకెట్స్, కోటెడ్ పేపర్ బ్యాగ్స్.. తదితర ఉత్పత్తులను తయారు చేసే చాలా సంస్థలపై ప్రతికూల ప్రభావం పడింది. దాంతో, వ్యాపార సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. అయితే, ప్లాస్టిక బ్యాన్ కు సంబంధించి కేంద్రానికి మాత్రమే అధికారం ఉంటుందని కేరళ హై కోర్టు స్పష్టం చేసింది.