తెలుగు న్యూస్  /  National International  /  Foreign Varsities To Have Autonomy To Decide Admission Processes, Fees

Foreign varsities in India: భారత్ లోని విదేశీ వర్సిటీలకే ఆ అధికాారాలు

HT Telugu Desk HT Telugu

05 January 2023, 17:45 IST

  • Foreign varsities in India: భారత్ లో క్యాంపస్ లను ఏర్పాటు చేస్తున్న విదేశీ విద్యా సంస్థలకు కీలకమైన వెసులుబాటు కల్పించనున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Foreign varsities in India: భారత్ లోని విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యావకాశాలు లభించే దిశగా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. విదేశీ విద్యాసంస్థలు భారత్ లో తమ క్యాంపస్ లను ఏర్పాటు చేసుకునేందుకు, వాటికి అనేక సదుపాయాలను కల్పిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

Foreign varsities in India: ఇకపై ఆ అధికారం కూడా..

భారత్ లో క్యాంపస్ లను ఏర్పాటు చేసే విదేశీ యూనివర్సిటీలు తమ అడ్మిషన్ విధానాన్ని, తమ ఫీజులను తామే నిర్ణయించుకునేందుకు అనుమతించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(University Grants Commission UGC) వెల్లడించింది. అయితే, భారత్ లో క్యాంపస్ లను ఏర్పాటు చేసి, ప్రత్యక్ష విధానంలో ఫుల్ టైమ్ కోర్సులను అందించే వర్సిటీలకే ఈ అవకాశం ఉంటుందని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ వెల్లడించారు. విదేశీ వర్సిటీలు యూజీసీ అనుమతి లేకుండా భారత్ లో క్యాంపస్ లను ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా టాప్ 500 జాబితాలో ఉన్న వర్సిటీలు కానీ, ఆయా దేశాల్లోని ప్రముఖ వర్సిటీలు కానీ భారత్ లో క్యాంపస్ లను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇస్తామని జగదీశ్ కుమార్ వెల్లడించారు.

Foreign varsities in India: డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్

విదేశీ వర్సిటీలు భారత్ లో క్యాంపస్ లను ఏర్పాటు చేయడానికి పాటించాల్సిన విధి విధానాలతో ముసాయిదా నిబంధనావళి (draft UGC (Setting up and Operation of Campuses of Foreign Higher Educational Institutions in India) Regulations, 2023)ని యూజీసీ ప్రకటించింది. ఈ ముసాయిదా నిబంధనావళిపై సలహాలు సూచనలను ఇవ్వవచ్చని, అందుకు చివరి తేదీ జనవరి 18 అని స్పష్టం చేసింది. జాతీయ విద్యా విధానానికి(National Education Policy NEP) అనుగుణంగా ఈ నిబంధనావళిని రూపొందించారు. ఇందులో భాగంగా, భారత్ లో కోర్సులను ప్రారంభించాలనుకునే విదేశీ విద్యా సంస్థలకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వాలని నిర్ణయించారు.

Foreign varsities in India: ఫీజు విషయంలో వారిదే నిర్ణయం

అడ్మిషన్ ప్రక్రియ, ఫీజు ల విషయంలో తుది నిర్ణయం ఆయా విదేశీ వర్సిటీలకే ఉండేలా ముసాయిదాలో పొందుపర్చారు. అయితే, అవి పారదర్శకంగా, సహేతుకంగా ఉండాలని సూచించారు. భారత్ లో క్యాంపస్ లను ప్రారంభించాలనుకునే విదేశీ యూనివర్సిటీలు ఆన్ లైన్ లో యూజీసీ కి దరఖాస్తు చేసుకోవాలని యూజీసీ సూచించింది. యూజీసీ స్టాండింగ కమిటీ ఆయా దరఖాస్తులను పరిశీలిస్తుందని తెలిపింది. బారత్ లో అందిస్తున్న కోర్సుల సర్టిఫికెట్లకు, ఆయా విదేశీ వర్సిటీలు తమ ప్రధాన క్యాంపస్ లలో ఇచ్చే కోర్సుల సర్టిఫికెట్లతో సమానమైన విలువ ఇవ్వాలని స్పష్టం చేసింది.