తెలుగు న్యూస్  /  National International  /  Fitness Instructor Accused By Actor Of Rape Arrested

Rape on actress: తెలుగు నటిపై అత్యాచారం.. ఫిట్‌నెస్ ట్రైనర్ అరెస్ట్

HT Telugu Desk HT Telugu

14 September 2022, 13:55 IST

  • Rape on actress: తెలుగు సినిమాల్లో పనిచేసిన 24 ఏళ్ల నటి అత్యాచార ఆరోపణలతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ఓ ఫిట్‌నెస్ ట్రైనర్‌ను అరెస్టు చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rape on actress: తనపై అత్యాచారం చేశాడని 24 ఏళ్ల తెలుగు నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కఫ్ పరేడ్ నుండి ఫిట్‌నెస్ ట్రైనర్‌ను అరెస్టు చేశారు. నిందితుడిని ఆదిత్య కపూర్‌గా గుర్తించారు.

ట్రెండింగ్ వార్తలు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

బాంద్రాలోని దివంగత శాస్త్రీయ గాయకుడి కుటుంబానికి చెందిన మోడల్, నటి ఇంట్లో ఆ మహిళ 2021 ఆగస్టులో ఆదిత్యను కలిసిందని పోలీసులు తెలిపారు.

‘వారు తమ సెల్ ఫోన్ నెంబర్లను మార్చుకున్నారు. లాక్‌డౌన్ ఉన్నందున ఆమె ఆదిత్యను కఫ్ పరేడ్‌లోని జేడీ సోమాని మార్గ్‌లోని అతడి ఇంట్లో కలిశారు. అతను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడు. తరువాత ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు..’ అని కఫ్ పరేడ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక పోలీసు అధికారి తెలిపారు.

‘వారు గోవాలో కూడా కలుసుకున్నారు. అక్కడ అతను ఒక లాడ్జిలో ఆమెపై దాడి చేశాడు..’ అని అధికారి తెలిపారు. ‘ఆమెను చంపేస్తానని, ఆమె ప్రైవేట్ ఫోటోలను వైరల్ చేస్తానని బెదిరించి చాలాసార్లు లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఆమె తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉండేలా ప్రేరేపించాడు. దాని ఫలితంగా ఆమె జనవరి 2022లో అతని అపార్ట్‌మెంట్‌కు మారింది. అతడి దుష్ప్రవర్తనతో విసిగిపోయి మార్చిలో తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వెళ్లింది. అయితే నిందితుడు తనను బెదిరిస్తూనే ఉన్నాడని ఆమె ఆరోపించింది. సెప్టెంబరు 3న తనను కలవాలని కోరాడు. రాకుంటే తన కజిన్‌ను చంపేస్తానని బెదిరించాడు..’ అని పోలీసులు వివరించారు.

‘ఆదిత్య తనను బాంద్రాలో కలుసుకుని కఫ్ పరేడ్‌కి తీసుకెళ్లారు. కలవడానికి ఆసక్తి లేదని చెప్పినప్పుడు అతడు లోయర్ పరేల్‌లోని రెస్టారెంట్‌కు తీసుకెళ్లి, ఆపై తనపై దాడి చేశాడు..’ అని బాధితురాలు ఫిర్యాదు చేసిందని పోలీసులు వివరించారు.

తనపై దొంగతనం ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పి పోలీసులను ఆశ్రయించింది. ‘మేం బాధితురాలిని జేజే ఆసుపత్రికి చెక్-అప్ కోసం తీసుకెళ్లాం..’ అని పోలీసు అధికారి తెలిపారు.