తెలుగు న్యూస్  /  National International  /  Fighting To Free Shiv Sainiks From Mva's Clutches, Says Eknath Shinde

Eknath Shinde message | `శివ‌సైనికుల కోస‌మే..!`

HT Telugu Desk HT Telugu

25 June 2022, 22:40 IST

  • శివ సేన కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే ఒక సందేశం ఇచ్చారు. త‌న పోరాటం శివ‌సైనికుల కోస‌మేన‌ని అందులో తెలిపారు.

ఏక్‌నాథ్ షిండే
ఏక్‌నాథ్ షిండే

ఏక్‌నాథ్ షిండే

మ‌హారాష్ట్ర‌లో అధికారంలో ఉన్న `మ‌హా వికాస్ అఘాడీ` సంకెళ్ల నుంచి శివ‌సైనికుల‌ను త‌ప్పించ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌న్నారు. `మ‌హా వికాస్ అఘాడీ`లో శివ‌సేన‌, కాంగ్రెస్‌, ఎన్సీపీ భాగ‌స్వామ్య ప‌క్షాలుగా ఉన్న విష‌యం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

మీ కోస‌మే..

శివ సేన కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఏక్‌నాథ్ షిండే ట్విట‌ర్‌లో ఒక సందేశం ఇచ్చారు. మ‌హారాష్ట్ర‌లో అధికార కూట‌మి సంకెళ్ల‌ నుంచి శివ‌సైనికుల‌ను విముక్తి చేయ‌డ‌మే త‌న పోరాటం ఉద్దేశ‌మ‌న్నారు. శివ‌సైనికుల ప్ర‌యోజ‌నాల కోస‌మే తాను పోరాడుతున్నాన‌న్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల ఇళ్లు, ఆఫీస్‌ల‌పై శివ‌సేన కార్య‌క‌ర్త‌లు దాడులు చేస్తున్న‌నేప‌థ్యంలో వారిని బుజ్జ‌గించే ఉద్దేశంతో షిండే ఈ ట్వీట్ చేశార‌ని భావిస్తున్నారు. గ‌త రెండు రోజులుగా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఉద్ధ‌వ్ ఠాక్రే చేస్తున్న భావోద్వేగ ప్ర‌సంగాలు కూడా శివ‌సేన కార్య‌క‌ర్త‌ల‌పై ప్ర‌భావం చూపాయ‌ని, రానున్న రోజుల్లో రెబ‌ల్ ఎమ్మెల్యేల‌పై నిర‌స‌న‌లు మ‌రింత పెరిగే అవ‌కాశ‌ముంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

ఎన్సీపీతో క‌లిసి ప‌నిచేయ‌లేం

మరోవైపు, ఏక్‌నాథ్ షిండే కుమారుడు, శివ‌సేన ఎంపీ శ్రీకాంత్ షిండే ఈ తిరుగుబాటు ప్రారంభ‌మైన త‌రువాత తొలిసారి థానేలో మ‌ద్ద‌తుదారుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూట‌మి స‌హ‌జ‌మైంది కాద‌ని వ్యాఖ్యానించారు. ఎన్సీపీతో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా క‌ష్ట‌మ‌న్నారు. కాగా, గువాహ‌టిలోని ఒక హోట‌ల్‌లో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు అక్క‌డే మ‌రో రెండు రోజులు ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

టాపిక్