తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cji Chandrachud: ‘‘విస్కీకి నేను పెద్ద అభిమానిని’’- సీజేఐ చంద్రచూడ్, సీనియర్ అడ్వొకేట్ మధ్య సరదా సంభాషణ

CJI Chandrachud: ‘‘విస్కీకి నేను పెద్ద అభిమానిని’’- సీజేఐ చంద్రచూడ్, సీనియర్ అడ్వొకేట్ మధ్య సరదా సంభాషణ

HT Telugu Desk HT Telugu

04 April 2024, 14:44 IST

  • సుప్రీంకోర్టులో కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య సీరియస్ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే కాదు.. అప్పుడప్పుడు సరదా సంభాషణలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటి సరదా ముచ్చటే ఈ మధ్య ఒక కేసు విచారణ సందర్భంగా సీజేఐ డీవై చంద్రచూడ్, సీనియర్ న్యాయవాది దినేశ్ ద్వివేది మధ్య జరిగింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (PTI)

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్

CJI DY Chandrachud whiskey banter: ఈ మధ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, సీనియర్ న్యాయవాది దినేష్ ద్వివేది ల మధ్య కోర్టు హాళ్లో జరిగి సరదా సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పారిశ్రామిక మద్యానికి సంబంధించి కేసును సుప్రీంకోర్టు విచారిస్తున్న సందర్భంగా ఈ హాస్యభరిత సంభాషణ జరిగినట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

కోర్టు హాళ్లో సరదా సీన్

ఇంటర్నెట్లో వైరల్ గా మారిన ఆ వీడియోలో పారిశ్రామిక మద్యానికి సంబంధించిన కేసును వాదిస్తున్న సీనియర్ న్యాయవాది దినేష్ ద్వివేది ధర్మాసనాన్ని ఉద్దేశిస్తూ.. ‘‘నా రంగురంగుల జుట్టుకు క్షమించండి. దీనికి కారణం హోలీ. ఇంట్లో చాలా మంది పిల్లలు, మనవలు, మనవరాళ్లు ఉండటం వల్ల తలెత్తే సమస్య ఇది. అలాంటప్పుడు మనమేం చేయలేం’’ అన్నారు. దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ (CJI DY Chandrachud) స్పందిస్తూ, సరదాగా ‘‘హోలీకి మద్యంతో సంబంధం లేదా?’’ అని ప్రశ్నించారు. సీజేఐ ప్రశ్నకు అడ్వొకేట్ ద్వివేదీ స్పందిస్తూ.. ‘‘హోలీ అంటే కొంతవరకు ఆల్కహాల్ అని కూడా అర్థం. నేను ఒక విషయం మీ ముందు ఒప్పుకోవాలి, నాకు విస్కీ అంటే చాలా ఇష్టం’’ అని జవాబిచ్చారు.

సింగిల్ మాల్ట్ నీట్ గానే తాగాలి

ఈ వీడియోను రెండు రోజుల క్రితం పోస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1.5 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. దాదాపు 400 లైక్స్ రాబట్టింది. ఈ వీడియో క్లిప్ పై నెటిజన్లు కూడా సరదాగా స్పందించారు. విచారణ సందర్భంగా విస్కీపై తనకున్న అభిమానం గురించి ద్వివేది మరింత వివరించారు. ‘‘నేను సింగిల్ మాల్ట్ విస్కీని ఇష్టపడతాను. సింగిల్ మాల్ట్ విస్కీకి మక్కా లాంటిది ఎడిన్ బర్గ్ కు ఈ మధ్య వెళ్లాను. నేను నా విస్కీ పెగ్ లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేయాలనుకున్నాను. కానీ వెయిటర్ అందుకు అంగీకరించలేదు. సింగిల్ మాల్ట్ విస్కీని నీట్ (ఏం కలుపుకోకుండా) గానే తాగాలి అని చెప్పాడు. దానికి ప్రత్యేక గ్లాస్ కూడా ఉంది. ఈ విషయం నాకు మొదటిసారి తెలిసింది’’ అని ద్వివేదీ వివరించారు.

తదుపరి వ్యాసం