world's oldest whiskey: ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన విస్కీ ఇది, ధర తెలిస్తే అవాక్కవుతారు
world's oldest whiskey: స్కాచ్ విస్కీ అంటే ఎంతో మంది ఆల్కహాల్ ప్రియులకు ప్రాణం. ప్రపంచంలోనే అతి పురాతన విస్కీ వేలానికి వచ్చింది.
world's oldest whiskey: ఆల్కహాల్ తాగే వారికి విస్కీ పేరు చెబితే చాలు నోరూరిపోతుంది. బాటిల్ కనిపిస్తే దించకుండా తాగేయాలనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన విస్కీని కనుగొన్నారు. స్కాట్లాండ్ దేశంలో బ్లెయిర్ రోడ్డులో ఈ విస్కీని వేలం వేయనున్నారు. ఈ విస్కీ చాలా ప్రాచీనమైనది. 1833లో దీన్ని తయారు చేసి నిల్వ చేసినట్టు చెబుతున్నారు. దాదాపు రెండు డజన్ల బాటిళ్లను వేలానికి ఉంచుతున్నారు. ఒక్కో బాటిల్ ఖరీదు అక్షరాలా పది లక్షల రూపాయలు.
ఈ విస్కీ ప్రాచీనమైనవి కావడంతో వాటి ధర ఇంతగా పెరిగిపోయింది. వాటిని వేటితో తయారు చేశారు అనేది మాత్రం ఇంకా వివరాలు అస్పష్టంగానే ఉన్నాయి. కార్బన్ డేటింగ్ ప్రకారం ఈ విస్కీలు తయారైనవి మాత్రం 1830లో జరిగి ఉంటుందని చెబుతున్నారు. ఇక వాటిని బాటిల్ లో వేసి భద్రపరచడం 1841లో జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పురాతన తవ్వకాల్లో ఈ స్కాచ్ విస్కీ బాటిల్‌లు బయటపడ్డాయి.
ఈ పురాతన స్కాచ్ విస్కీ బాటిళ్లను స్కాట్లాండ్లోని బ్లెయిర్ కోటలో లభించాయి. ఆ కోటలో ఏడు శతాబ్దాలకు పైగా అథోల్ కుటుంబానికి చెందిన పూర్వీకులు నివసించేవారు. వారు తాగేందుకు తయారు చేసుకున్నవే ఈ విస్కీ అని భావిస్తున్నారు. చరిత్రకారులు బ్లెయిర్ కోటకు చెందిన చారిత్రక రికార్డులను పరిశీలిస్తే విస్కీ తయారీ పద్ధతులపై కొన్ని రికార్డులు లభించాయి. విక్టోరియా రాణి 1844లో ఈ బ్లెయిర్ కోటకు సందర్శనకు వచ్చారు. ఆ సమయంలో ఆమెకు అనేక విస్కీ బాటిల్‌లను బహుమతులుగా ఇచ్చినట్టు తెలుస్తోంది.
విస్కీ తయారు చేసిన వెంటనే ఎవరూ తాగరు. దాని టేస్ట్ బావుండాలంటే విస్కీని ఎక్కువ ఏళ్లపాటు నిల్వ చేయాలి. దీన్నే ఫెర్మెంటేషన్ అంటారు. విస్కీని చూడగానే గోల్డ్ కలర్లో మెరిసిపోతుంది. బెల్లం నీళ్ళను, పలుచటి తేనెను చూసినట్టు అనిపిస్తుంది. విస్కీని ఎక్కువ ఏళ్లపాటు నిల్వ చేస్తే ఇలా బంగారు రంగులోకి మారే అవకాశం ఎక్కువ. దీనిని నిల్వ చేసేందుకు ఒక చెక్క పీపాను సిద్ధం చేస్తారు. కొన్ని ఏళ్లపాటు మూత పెట్టి నిల్వ చేస్తారు. కొంతమంది ఓక్ చెట్ల నుంచి తయారు చేసిన పీపాల్లో విస్కీని నిల్వ ఉంచుతారు.
కొన్నేళ్ల పాటూ నిల్వ చేసిన విస్కీనే తాగగలరు. తయారు చేసిన వెంటనే విస్కీని తాగితే చాలా చేదుగా అనిపిస్తుంది. విస్కీని ఇలా పీపాల్లో ఉంచడం వల్ల అతి ఘాటు, అతి మంట తగ్గుతుంది. విస్కీకి మంచి రుచి రావాలంటే కనీసం పదేళ్లు పడుతుంది సాధారణంగా బయట దొరికే విస్కీలు రెండు మూడేళ్లు నిల్వ ఉంచాక అమ్ముతారు. టేస్టీ విస్కీ కావాలంటే పది నుంచి 18 ఏళ్ల వరకు నిల్వ చేయాలి. ప్రపంచంలోనే అతి ఖరీదైన విస్కీని 2019లో వేలం వేశారు. దీన్ని 1926లో తయారు చేశారు. ఆ విస్కీ బాటిల్ ధర 12 కోట్లకు పై మాటే.