తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Masks Not Mandatory On Flights: విమానాల్లో మాస్క్ ధరించడంపై కొత్త సూచనలు

Masks not mandatory on flights: విమానాల్లో మాస్క్ ధరించడంపై కొత్త సూచనలు

HT Telugu Desk HT Telugu

16 November 2022, 20:42 IST

  • Masks not mandatory on flights: ఇక విమాన ప్రయాణాల్లో ప్రయాణీకులు మాస్క్ ను కచ్చితంగా ధరించాల్సిన అవసరం లేదు. మాస్క్ ధరించని వారిపై ఎలాంటి చర్యలు ఉండవు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (AFP File Photo)

ప్రతీకాత్మక చిత్రం

Masks not mandatory on flights: విమానాల్లో ఇకపై మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ బుధవారం ప్రకటించింది. మాస్క్ ధరించని వారిపై ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేసింది. మాస్క్ ధరించడం కచ్చితం కాదు కానీ, తమతో పాటు సహ ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మాస్క్ లు ధరించడం మంచిదని సూచించింది. విమాన ప్రయాణాల్లో మాస్క్ ను ఉపయోగించడం ఇప్పటివరకు తప్పని సరి అన్న నిబంధన ఉంది. ఆ నిబంధన పాటించనివారిపై చర్యలు కూడా ఉండేవి.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Masks not mandatory on flights: తగ్గుతున్న కేసుల సంఖ్య

కరోనా వైరస్ ముప్పు తగ్గుతోంది. కోవిడ్ 19 కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతోంది. కరోనా కేసులు ఇప్పుడు నామమాత్రంగానే నమోదవుతున్నాయి. చైనాను మినహాయిస్తే, దాదాపు ప్రపంచ దేశాలన్నీ కోవిడ్ ఆంక్షలను సడలించడం ప్రారంభించాయి. భారత్ లో అయితే, ప్రజలు మాస్క్ ను మర్చిపోయి చాలాకాలమైంది. ఇతర కొవిడ్ ప్రొటోకాల్ ను సైతం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో, పౌర విమానయాన శాఖ తాజా ఆదేశాలను జారీ చేసింది.

Masks not mandatory on flights: మాస్క్ మంచిది..

విమాన ప్రయాణాల్లో మాస్క్ కచ్చితంగా ధరించాలన్న నిబంధనను ఎత్తివేస్తూనే, మాస్క్ ను ధరించడం ఆరోగ్యరీత్యా మంచిదని విమానయాన శాఖ సూచించింది. మాస్క్ ధరించడం వల్ల తమతో పాటు సహ ప్రయాణీకులకు కరోనా ముప్పు తగ్గుతుందని వివరించింది. ఈ మేరకు అన్ని విమానయాన సంస్థలకు సమాచారం ఇచ్చింది. ఫ్లైట్ అనౌన్స్ మెంట్లలో కూడా.. ప్రయాణీకులు మాస్క్ లు ధరిస్తే మంచిదన్న సూచన మాత్రమే ఇవ్వాలని అందులో పేర్కొంది.

టాపిక్