HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : షాకింగ్​.. మద్యం మత్తులో పోలీసులపై పెట్రోల్​ పోశాడు- నిప్పంటించేందుకు..

Crime news : షాకింగ్​.. మద్యం మత్తులో పోలీసులపై పెట్రోల్​ పోశాడు- నిప్పంటించేందుకు..

Sharath Chitturi HT Telugu

07 July 2024, 7:35 IST

  • మహారాష్ట్ర పూణెలో షాకింగ్​ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా.. ఇద్దరు పోలీసులపై పెట్రోల్​ పోశాడు ఓ వ్యక్తి. చివరికి..

మద్యం మత్తులో పోలీసులపై పెట్రోల్​ పోశాడు
మద్యం మత్తులో పోలీసులపై పెట్రోల్​ పోశాడు

మద్యం మత్తులో పోలీసులపై పెట్రోల్​ పోశాడు

పూణెలో షాకింగ్​ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి, ఏకంగా పోలీసులపైనే పెట్రోల్​ పోసి, నిప్పంటించేందుకు ప్రయత్నించాడు. కానీ అతను చేసిన ఓ పనితో పోలీసులు తృటిలో ప్రాణాలను కాపాడుకున్నారు.

ఇదీ జరిగింది..

పూణె పరస్ఖానా ట్రాఫిక్​ డివిజన్​ వద్ద శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న సంజయ్​ ఫకీర సాల్వేని పోలీసులు అడ్డుకున్నారు. అతనికి ఫైన్​ వేసేందుకు చలాన్​ మెషీన్​ బయటకు తీశారు. తనని ఆపడమే కాదు ఫైన్​ వేస్తున్నారని తెలిసి సాల్వేకి కోపం వచ్చింది. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. కొంతసేపటికి పెట్రోల్​తో తిరిగి వచ్చాడు. అక్కడే ఉన్న అసిస్టెంట్​ పోలీస్​ ఇన్​స్పెక్టర్​ శైలజ జన్​కర్​తో పాటు మరో కానిస్టేబుల్​పై పెట్రోల్​ పోశాడు. వారు ఒక్క క్షణం షాక్​కు గురయ్యారు.

ఇంతలో, పెట్రోల్​ పోసిన అనంతరం లైటర్​ బయటకు తీసి, దానిని వెలిగించేందుకు ప్రయత్నించాడు నిందితుడు. కానీ మద్యం మత్తులో దానిని రివర్స్​ డైరెక్షన్​లో పట్టుకుని వెలిగించేందుకు ప్రయత్నించాడు. అది సరైన సమయంలో వెలగలేదు. ఘటన నుంచి ఆ ఇద్దరు పోలీసులతో పాటు పక్కనే ఉన్న మరింకొందరు కానిస్టేబుళ్లు తేరుకుని, సాల్వేని పట్టుకున్నారు. నేల మీద పడేసి, అతడి నుంచి లైటర్​ని తీసుకున్నారు. అతడిని అరెస్ట్​ చేసి పోలీస్​ స్టేషన్​కి తరలించారు.

ఘటనాస్థలంలో ఉన్న సమీర్​ ప్రకాశ్​ సావంత్​ అనే కానిస్టేబుల్​ నిందితుడిపై కేసు వేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్టు, దర్యాప్తు చేపట్టినట్టు డిప్యూటీ కమిషనర్​ ఆఫ్​ పోలీస్​ సందీప్​ సింగ్​ గిల్​ తెలిపారు.

నిందితుడిపై నూతన క్రిమినల్​ చట్టాల్లోని సెక్షన్​ 109, 132 కింద కేసు నమోదైంది.

ఘటనతో బాధితురాలు ఏఎస్​పీ శైలజ షాక్​కు గురయ్యారు.

"నా మీద పెట్రోల్​ పేసి, నిప్పంటించేందుకు ప్రయత్నించాడు. షాక్​లో ఒక గంట పాటు ఏం మాట్లాడలేకపోయాను. ఘటన నుంచి తేరుకునేందుకు చాలా సమయం పడుతుంది," అని శైలజ తెలిపారు.

ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. మద్యం మత్తులో పోలీసులపైనే పెట్రోల్​ పోయడం ఏంటని షాక్​కు గురవుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేస్తున్నారు.

టీచర్​ను క్లాస్​రూమ్​లోనే కత్తితో పొడిచి చంపిన విద్యార్థి

దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక మూల ఏదో క్రైమ్​ జరుగుతూనే ఉంటోంది. క్లాస్​రూమ్​లో టీచర్​ని ఓ విద్యార్థి కత్తితో పొడిచి చంపాడు.

అసోంలోని శివసాగర్ లోని కోచింగ్ సెంటర్ లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉపాధ్యాయుడు ఏదో విషయంలో మందలించాడు. దాంతో, ఆ టీచర్ పై కోపం పెంచుకున్న ఆ విద్యార్థి ఆ టీచర్ ను తరగతి గదిలోనే కత్తితో పొడిచి చంపాడు. మైనర్ అయిన ఆ విద్యార్థిని శివసాగర్ లోని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఆ ఉపాధ్యాయుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్