తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News: తిట్టినందుకు టీచర్ ను క్లాస్ రూమ్ లోనే కత్తితో పొడిచి చంపిన విద్యార్థి

Crime news: తిట్టినందుకు టీచర్ ను క్లాస్ రూమ్ లోనే కత్తితో పొడిచి చంపిన విద్యార్థి

HT Telugu Desk HT Telugu

06 July 2024, 21:18 IST

google News
  • Assam Crime news: తోటి విద్యార్థుల ముందు తనను తిట్టాడన్న కోపంతో ఉపాధ్యాయుడిని కత్తితో ఒక విద్యార్థి పొడిచి చంపేశాడు. ఈ దారుణ ఘటన అస్సాంలో జరిగింది. 11వ తరగతి చదువుతున్న విద్యార్థి ఈ దారుణానికి పాల్పడ్డాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టీచర్ ను క్లాస్ రూమ్ లోనే కత్తితో పొడిచి చంపిన విద్యార్థి
టీచర్ ను క్లాస్ రూమ్ లోనే కత్తితో పొడిచి చంపిన విద్యార్థి (Pixabay)

టీచర్ ను క్లాస్ రూమ్ లోనే కత్తితో పొడిచి చంపిన విద్యార్థి

Assam Crime news: అసోంలోని శివసాగర్ లోని కోచింగ్ సెంటర్ లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉపాధ్యాయుడు ఏదో విషయంలో మందలించాడు. దాంతో, ఆ టీచర్ పై కోపం పెంచుకున్న ఆ విద్యార్థి ఆ టీచర్ ను తరగతి గదిలోనే కత్తితో పొడిచి చంపాడు. మైనర్ అయిన ఆ విద్యార్థిని శివసాగర్ లోని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అసలేం జరిగిందంటే..

అస్సాంలోని శివసాగర్ లో ఉన్న ఒక కోచింగ్ సెంటర్ లో ఈ ఘటన జరిగింది. ఈ దారుణం జరిగిన సమయంలో ఇతర ఉపాధ్యాయులెవరూ లేరు. ఇతర విద్యార్థులు తెలిపిన సమాచారం ప్రకారం.. 11వ తరగతి చదువుతున్న విద్యార్థి ని కోచింగ్ సెంటర్ లోని టీచర్ ఏదో విషయంపై మందలించాడు. దాంతో, క్లాస్ రూమ్ లో నుంచి వెళ్లి పోయిన ఆ విద్యార్థి మళ్లీ కొన్ని గంటల తరువాత తిరిగి వచ్చాడు. తరగతి గదిలో ఉన్న టీచర్ ను తనతో పాటు తెచ్చుకున్న కత్తితో విచక్షణా రహితంగా పొడిచి, కత్తిని అక్కడే పడేసి పారిపోయాడు.

ఆసుపత్రికి తరలింపు

ఆ ఉపాధ్యాయుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. ‘‘కత్తిపోట్లకు గురైనట్లు సమాచారం అందడంతో కోచింగ్ సెంటర్ కు చేరుకున్నాం. ప్రాథమిక సమాచారం ప్రకారం ఓ విద్యార్థి తన టీచర్ ను కత్తితో పొడిచాడు. తరగతి గదిలో చాలా రక్తం ఉంది. కత్తి కూడా అక్కడే దొరికింది’’ అని పోలీసులు తెలిపారు. ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదని, సీసీటీవీ ఫుటేజీలను సేకరించే పనిలో ఉన్నామని తెలిపారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.
తదుపరి వ్యాసం