HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru Crime News: కాలేజీలోనికి పంపించలేదని సెక్యూరిటీ గార్డ్ ను పొడిచి చంపిన స్టుడెంట్

Bengaluru Crime news: కాలేజీలోనికి పంపించలేదని సెక్యూరిటీ గార్డ్ ను పొడిచి చంపిన స్టుడెంట్

HT Telugu Desk HT Telugu

04 July 2024, 16:04 IST

  • Bengaluru Crime news: కాలేజీ క్యాంపస్ లోనికి పంపించడం లేదని ఒక స్టుడెంట్ కాలేజీ సెక్యూరిటీ గార్డ్ ను కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన బెంగళూరులో మంగళవారం చోటుచేసుకోగా, సోషల్ మీడియాలో వైరల్ అయిన సీసీటీవీ ఫుటేజీలో విద్యార్థి సెక్యూరిటీ గార్డును ఆ విద్యార్థి కత్తితో పొడుస్తున్న దృశ్యాలు కనిపించాయి.

కాలేజీ సెక్యూరిటీ గార్డ్ ను హత్య చేసిన స్టుడెంట్
కాలేజీ సెక్యూరిటీ గార్డ్ ను హత్య చేసిన స్టుడెంట్

కాలేజీ సెక్యూరిటీ గార్డ్ ను హత్య చేసిన స్టుడెంట్

Bengaluru Crime news: బెంగళూరులో 22 ఏళ్ల ఓ విద్యార్థి తన కాలేజీ సమయంలో క్యాంపస్ లోనికి అనుమతించనందుకు సెక్యూరిటీ గార్డును హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన సీసీటీవీ ఫుటేజీలో విద్యార్థి సెక్యూరిటీ గార్డును కత్తితో పొడుస్తున్న దృశ్యాలు కనిపించాయి.

కెంపాపురలోని సింధీ కళాశాలలో..

నిందితుడిని కెంపాపురలోని సింధీ కళాశాలలో బీఏ మూడో సంవత్సరం చదువుతున్న భార్గవ్ జ్యోతి భూమ్రాన్ గా గుర్తించారు. కాలేజ్ ఫెస్ట్ లో పాల్గొన్న భూమ్రాన్ మధ్యాహ్నం సమయంలో కాలేజీ నుంచి బయటకు రావాలనుకున్నాడు. బయటకు వెళితే మళ్లీ ఆ రోజు క్యాంపస్ లోకి రానివ్వబోమని ఓ ఉద్యోగి హెచ్చరించాడు. అయినా, భూమ్రాన్ కాలేజీ నుంచి వెళ్లిపోయాడు.

కత్తితో తిరిగి వచ్చి..

తిరిగి మధ్యాహ్నం 12:30 గంటలకు క్యాంపస్ కు తిరిగి రావడానికి ప్రయత్నించగా సెక్యూరిటీ గార్డు అతన్ని అడ్డగించి కళాశాలలోకి వెళ్లడానికి అనుమతించలేదు. దాంతో, తిరిగి వెళ్లిపోయిన భూమ్రాన్ మధ్యాహ్నం 2.30 గంటలకు మళ్లీ కాలేజీ వద్దకు వచ్చాడు. గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డుతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం ప్యాంట్ జేబులో నుంచి కత్తిని తీసి సెక్యూరిటీ గార్డు ఛాతీపై పలుమార్లు పొడిచి పరారయ్యాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ ను వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

అస్సాం నుంచి వచ్చి..

నిందితుడు ఈ హత్య చేసినప్పుడు మద్యం మత్తులో కానీ, డ్రగ్స్ తీసుకుని కానీ ఉండవచ్చని తాము అనుమానిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడి నేపథ్యంపై కూడా ఆరా తీస్తున్నామని తెలిపారు. అస్సాంకు చెందిన భూమ్రాన్ చదువు కోసం బెంగళూరు వచ్చాడు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్