తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Biden's Cancerous Lesion: అమెరికా అధ్యక్షుడు బైడెన్ కి తప్పిన కేన్సర్ ముప్పు

Biden's cancerous lesion: అమెరికా అధ్యక్షుడు బైడెన్ కి తప్పిన కేన్సర్ ముప్పు

HT Telugu Desk HT Telugu

04 March 2023, 21:29 IST

    • Biden's cancerous lesion: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కు కేన్సర్ (cancer) ముప్పు తప్పింది. జనవరి నెలలో ఇందుకు సంబంధించిన ఒక సర్జరీ ఆయనకు జరిగింది. 
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (ఫైల్ ఫొటో)
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (ఫైల్ ఫొటో) (REUTERS)

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (ఫైల్ ఫొటో)

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కు గత నెలలో ఒక సర్జరీ జరిగింది. ఆయన ఛాతిపై ఉన్న ఒక చిన్న కణితిని సర్జరీ చేసి తొలగించారు.

ట్రెండింగ్ వార్తలు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

Biden's cancerous lesion: అది కేన్సేరియస్..

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఛాతి భాగం నుంచి సర్జరీ చేసి తొలగించిన చిన్న కణితిని బయాప్సీకి పంపించారు. ఆ భాగంలో కేన్సర్ (cancer) కు సంబంధించిన కణాలేమైనా ఉన్నాయా అని తేల్చేందుకు ఆ శరీర భాగాన్ని బయాప్సీకి పంపించారు. తాజాగా, ఆ బయాప్సీ నివేదిక వచ్చింది. బైడెన్ (Joe Biden) ఛాతి భాగం నుంచి తొలగించిన గడ్డలో కేన్సేరియస్ కణాలున్నవని, అది కేన్సర్ (cancer) కణితేనని బయాప్సీలో తేలింది. చర్మ కేన్సర్ కు సంబంధించిన బేసల్ సెల్ కార్సినోమా (basal cell carcinoma) ను ఆ కణితిలో వైద్యులు గుర్తించారు. ఇది స్కిన్ కేన్సర్స్ లో సాధారణ రకమని వైద్యులు తెలిపారు.

Biden's cancerous lesion: ఇక చికిత్స అక్కర్లేదు..

అయితే, అదృష్టవశాత్తూ, ఆ కణిితిలోని కేన్సర్ కణాలు శరీరంలోని ఇతర భాగాలకు విస్తరించలేదని, అందువల్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కు అదనంగా చికిత్స ఏమీ అవసరం లేదని జో బైడెన్ వ్యక్తిగత ఫిజీషియన్ డాక్టర్ కెవిన్ ఓ కానర్ వెల్లడించారు. బైడెన్ శరీరం నుంచి కేన్సర్ (cancer) కారక కణజాలాన్ని పూర్తిగా విజయవంతంగా తొలగించినట్లు తెలిపారు. అమెరికా దేశాధ్యక్షుడిగా అన్ని బాధ్యతలు నిర్వర్తించడానికి పూర్తి ఆరోగ్యంతో జో బైడెన్ (Joe Biden) ఉన్నారని స్పష్టం చేశారు. సర్జీరీ జరిగిన బైడెన్ ఛాతి భాగం కూడా పూర్తిగా సాధారణ స్థితికి వచ్చిందన్నారు. 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మళ్లీ దిగాలని జో బైడెన్ ఆలోచిస్తున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

Biden's cancerous lesion: బైడెన్ భార్యకు కూడా..

బేసల్ సెల్స్ (Basal cells) అనేవి సులభంగా చికిత్స చేసి, నిర్మూలించగల కేన్సర్ కణాలు. అయితే, వాటిని ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్స అంత సులభమవుతుంది. ఈ కణాలు ఇతర కేన్సర్ కణాల మాదిరిగా త్వరగా వేరే శరీర భాగాలకు విస్తరించవు. కానీ ఒకే దగ్గర పెద్దగా పెరిగి కణితిగా మారుతాయి. గతంలో, దేశాధ్యక్షుడిగా ఎన్నిక కాకముందు కూడా బైడెన్ (Joe Biden) చర్మంపై నుంచి కొన్ని cancer కణితులను తొలగించారు. బైడెన్ యువకుడిగా ఉన్న సమయంలో ఎక్కువ సమయం సూర్యరశ్మి ప్రభావానికి లోనుకావడం వల్ల ఈ సమస్య వచ్చి ఉండొచ్చని డాక్టర్ ఓ కానర్ అభిప్రాయపడ్డారు. బైడెన్ భార్య జిల్ బైడెన్ (Jill Biden) శరీరం నుంచి కూడా కేన్సర్ (cancer) కు సంబంధించిన రెండు కణితులను తొలగించారు. వారి కుమారుడు బ్యూ బైడెన్ (Beau Biden) 2015 లో బ్రెయిన్ కేన్సర్ (brain cancer) తో మృతి చెందారు.