తెలుగు న్యూస్  /  National International  /  Cyclone Mocha Likely To Hit Eastern Coast. Here's What We Know So Far

Cyclone Mocha: దూసుకొస్తున్న మోచా’ తుపాను; తూర్పు తీరం అప్రమత్తం

HT Telugu Desk HT Telugu

05 May 2023, 15:16 IST

    • Cyclone Mocha: బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారి తూర్పు తీరం వైపునకు దూసుకువస్తోంది. మే 7 -  మే 9 తేదీల మధ్య ఈ తుపాను తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ తుపానుకు మోచా అనే పేరు పెట్టారు. 
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cyclone Mocha: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారి తూర్పు తీరం వైపునకు వస్తోందని భారత వాతావరణ విభాగం (India Meteorological Department IMD) వెల్లడించింది. ఈ తుపానును మోచా (Mocha) అనే పేరు పెట్టారు. మే 7 - మే 9 తేదీల మధ్య ఈ తుపాను తీరం దాటే అవకాశముంది.

ట్రెండింగ్ వార్తలు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

Cyclone Mocha: సముద్రంలోకి వెళ్లొద్దు

మోచా (Mocha) తుపాను దూసుకొస్తన్న నేపథ్యంలో, మత్స్యకారులు బంగాళాఖాతంలోకి వేటకు సముద్రంలోకి వెళ్లకూడదని వాతావరణ విభాగం హెచ్చరించింది. అండమాన్, నికోబార్ దీవులు, ఒడిశాలపై ఈ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశముందని వెల్లడించారు. ఈ మోచా (Mocha) తుపాను ప్రభావంతో గంటకు 40 కిమీల నుంచి 60 కిమీల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో వాటి వేగం మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించింది. మోచా (Mocha) తుపాను కారణంగా అండమాన్, నికోబార్ దీవుల్లో, ఒడిశాలో తీవ్రమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. బంగ్లాదేశ్, మయన్మార్ ల్లోనూ ఈ మోచా తుపాను ప్రభావం ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో తీర జిల్లాల కలెక్టర్లను, తీర ప్రాంత అధికారులను ఒడిశా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మే 7 నుంచి మే 11 వరకు సముద్రంలోకి వెళ్లకూడదని ప్రజలను హెచ్చరించింది. సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఓడీఆర్ఏఓఫ్ (ODRAF) దళాలను సిద్ధం చేసింది.

Cyclone Mocha: మోచా తుపానుకు ఆ పేరెవరు పెట్టారు?

ఈ తుపానుకు మోచా (Mocha) అనే పేరును యెమెన్ దేశం సిఫారసు చేసింది. యెమెన్ లోని ప్రముఖ రేవు పట్టణం పేరు మోచా లేదా మోఖా (Mocha or Mokha). ఇది రెడ్ సీ తీరంలో ఉంటుంది. ఇక్కడి మోచా కాఫీ (Mocha coffee) ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. తుపాన్ల సమాచారంలో గందరగోళం నెలకొనకుండా ఉండడానికి వాటికి పేర్లు పెట్టాలని ప్రపంచ వాతావరణ సంస్థ (World Meteorological Organisation WMO) నిర్ణయించింది.