తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Southwest Monsoon : దక్షిణాదిలో వర్షాలు.. ఉత్తర భారతంలో హీట్​ వేవ్​!

Southwest monsoon : దక్షిణాదిలో వర్షాలు.. ఉత్తర భారతంలో హీట్​ వేవ్​!

Sharath Chitturi HT Telugu

10 June 2023, 9:06 IST

google News
  • Southwest monsoon in Kerala : కేరళలో వర్షాలు కురుస్తున్నాయి. బిపర్జాయ్​ తుపాను మరింత బలపడనుంది. ఉత్తర భారతంలో హీట్​ వేవ్​ పరిస్థితులు కొనసాగుతున్నాయి.

దక్షిణాదిలో వర్షాలు.. ఉత్తర భారతంలో హీట్​ వేవ్​!
దక్షిణాదిలో వర్షాలు.. ఉత్తర భారతంలో హీట్​ వేవ్​!

దక్షిణాదిలో వర్షాలు.. ఉత్తర భారతంలో హీట్​ వేవ్​!

Southwest monsoon in Kerala : అరేబియా సముద్రంలో పుట్టుకొచ్చిన బిపర్జాయ్​ తుపాను.. 24 గంటల్లో మరింత తీవ్రరూపం దాల్చనుందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. రానున్న 3 రోజుల్లో.. ఉత్తర- వాయువ్యంవైపు తుపాను ప్రయాణిస్తుందని పేర్కొంది.

ఐఎండీ ప్రకారం.. దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న 4 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురుస్తాయి. కేరళ, కర్ణాటక తీర ప్రాంతాల్లో మాత్రం.. సోమవారం వరకు భారీ నుంచి అతి భారీ వానలు పడతాయి. ఇక లక్షద్వీప్​లో ఆదివారం వరకు వర్షాలు కురుస్తాయి.

కేరళలో యెల్లో అలర్ట్​..

నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలోని 8 జిల్లాలకు యెల్లో అలర్ట్​ జారీ చేసింది వాతావరణశాఖ. తిరువనంతపురం, కొల్లమ్​, పథనమ్​తిట్ట, అలాప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, కొజికోడ్​, కన్నూర్​ జిల్లాలకు యెల్లో అలర్ట్​ కొనసాగుతోంది.

ఇదీ చూడండి:- Monsoon Updates:ఏపీకి చల్లటి కబురు.. మరో రెండు మూడు రోజుల్లో సీమను తాకనున్న 'నైరుతి'

Cyclone Biparjoy latest updates : సాధారణంగా జూన్​ 1 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయి. కానీ ఈ ఏడాది జూన్​ 8న అవి కేరళలోకి ప్రవేశించాయి. అయితే.. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్​ తుపాను కారణంగా.. రుతుపవనాల కదలిక నెమ్మదిస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే జూన్​ 15 నాటికి రుతుపవనాల వల్ల కురవాల్సిన వర్షాలు.. సాధారణ స్థితికి చేరే అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

ఈ రాష్ట్రాల్లో హీట్​ వేవ్​..

Heat wave news in India : వర్షాల కారణంగా కేరలకు యెల్లో అలర్ట్​ జారీ చేసిన ఐఎండీ.. ఉత్తర భారతంలోని దాదాపు 7 రాష్ట్రాలకు హీట్​ వేవ్​ హెచ్చరికలు ఇచ్చింది. బిహార్​లోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం వరకు హీట్​ వేవ్​ ప్రభావం కొనసాగుతుందని స్పష్టం చేసింది. పశ్చిమ్​ బెంగాల్​లోని గంగా నది ప్రాంతం, ఒడిశా- ఝార్ఖండ్​లోని పలు ప్రదేశాల్లో హీట్​ వేవ్​ ఎఫెక్ట్​ సోమవారం వరకు ఉంటుందని పేర్కొంది. ఉత్తర్​ ప్రదేశ్​, పశ్చిమ్​ బెంగాల్​లోని హిమాలయ ప్రాంతాలు, సిక్కిం, ఆంధ్రప్రదేశ్​లో శనివారం వరకు వడగాల్పులు కొనసాగుతాయని వివరించింది.

తదుపరి వ్యాసం