AP TS Weather: ఏపీలోని ఈ ప్రాంతాలకు హీట్ వేవ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి తెలంగాణలో వర్షాలు!-imd issues heatwave alert for few mandals in andhrapradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Imd Issues Heatwave Alert For Few Mandals In Andhrapradesh

AP TS Weather: ఏపీలోని ఈ ప్రాంతాలకు హీట్ వేవ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి తెలంగాణలో వర్షాలు!

Maheshwaram Mahendra Chary HT Telugu
May 27, 2023 07:00 AM IST

Weather Updates of Telugu States:తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ ఏపీలోని పలు మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణలోనూ పొడి వాతావరణమే ఉండనుంది.

ఏపీలో ఎండలు
ఏపీలో ఎండలు

AP and Telangana Weather Updates: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతన్నాయి. ద్రోణి ప్రభావంతో అక్కడకక్కడ మోస్తరు వర్షాలు పడగా... మళ్లీ భానుడి భగభగలు షురూ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 97 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. రేపు 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 47 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ అంచనాల మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

అల్లూరి జిల్లాలోని 2 మండలాలు,అనకాపల్లి 1, బాపట్ల 7, తూర్పుగోదావరి 7, ఏలూరు 4, గుంటూరు 17, కాకినాడ 9, కోనసీమ 10, కృష్ణా 15, ఎన్టీఆర్ 8, పల్నాడు 9, మన్యం4, పశ్చిమగోదావరి 3, వైయస్సార్ జిల్లాలోని ఒక మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉండనుంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని... ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి హెచ్చరించింది. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

ఇక శుక్రవారం తిరుపతి జిల్లా రేణిగుంటలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహమ సంస్థ వెల్లడించింది. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 43.7°C, చిత్తూరు జిల్లా నింద్ర 43.5°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది.

29 నుంచి మళ్లీ వర్షాలు..

ఇక తెలంగాణలోనూ ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ, రేపు కూడా ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మే 29, 30,31 తేదీల్లో వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. మే 29 -30 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇక శుక్రవారం నల్గొండ జిల్లా దామరచర్లలో గరిష్ఠంగా 44.3 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది.

రుతు పవనాల (Monsoon) రాకపై భారత వాతావరణ విభాగం కీలక ప్రకటన చేసింది. కేరళకు నైరుతి రుతుపవనాలు జూన్ 4 వ తేదీ వరకు చేరుతాయని వెల్లడించింది. సాధారణంగా నైరుతి రుతు పవనాలు (southwest monsoon) కేరళకు జూన్ 1వ తేదీ వరకు చేరుతాయి. ఈ సంవత్సరం అవి జూన్ 4 వరకు కేరళకు వస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) ప్రకటించింది.

IPL_Entry_Point