Monsoon Updates:ఏపీకి చల్లటి కబురు.. మరో రెండు మూడు రోజుల్లో సీమను తాకనున్న 'నైరుతి'-southwest monsoon likely to hit andhra pradesh check key updates are here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Monsoon Updates:ఏపీకి చల్లటి కబురు.. మరో రెండు మూడు రోజుల్లో సీమను తాకనున్న 'నైరుతి'

Monsoon Updates:ఏపీకి చల్లటి కబురు.. మరో రెండు మూడు రోజుల్లో సీమను తాకనున్న 'నైరుతి'

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 10, 2023 08:00 AM IST

Southwest Monsoon 2023 Updates: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రేపోమాపో ఏపీలోని సీమ ప్రాంతాలకు తాకే అవకాశం ఉంది.

వేగంగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు
వేగంగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు

Weather Updates of Andhrapradesh: కేరళ భూభాగాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. గడిచిన 24 గంటల్లో వాటి గమనంలో వేగం పెరగినట్లు వాతావరణశాఖ తెలిపింది. ఫలితంగా మరో రెండు మూడు రోజుల్లోనే ఏపీలోని రాయలసీమ ప్రాంతాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న 24 గంటల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు, బంగాళాఖాతంలోకి విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

రోహిణి కార్తె వెళ్లిపోయినప్పటికీ... తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మృగశిర కార్తెతో వాతావరణం చల్లబడుతుంది కానీ... ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. ఏపీతో పాటు తెలంగాణలోని అనేక జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43–46 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లో సాధారణంకంటే నాలుగైదు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా పలుచోట్ల వడగాడ్పులు, మరికొన్ని చోట్ల తీవ్ర వడగాడ్పులు వీచాయి. మరో వైపు ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. ఈ ప్రభావంతో పశ్చిమబెంగాల్‌, ఒడిశా ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో 24 గంటల వరకు ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఇక ఇవాళ తెలంగాణలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉండగా... మరికొన్ని ప్రాంతాలకు వేడిగాల్పుల హెచ్చరికలను జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడకక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక ఆసిఫాబాద్, నిర్మల్, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహూబాబాద్ లని అక్కడకక్కడ వడ గాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. జూన్ 14వ తేదీ వరకు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపింది.

ఇక సాధారణంగా జూన్‌ 1నాటికి నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తుంటాయి. బంగాళాఖాతంలో మేలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో వారం రోజులు ఆలస్యంగా దేశంలోకి వచ్చాయని వాతావరణశాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో అలప్పుజ, ఎర్నాకుళం ప్రాంతాల్లో ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. గత ఏడాది మే 29న రుతుపవనాలు దేశంలోకి రాగా.. 2021లో జూన్‌ 3న ప్రవేశించాయి.

Whats_app_banner

సంబంధిత కథనం