తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cuet Ug Results : సీయూఈటీ యూజీ 2024 ఫలితాలు ఎప్పుడు? ఎలా చెక్​ చేసుకోవాలి?

CUET UG results : సీయూఈటీ యూజీ 2024 ఫలితాలు ఎప్పుడు? ఎలా చెక్​ చేసుకోవాలి?

Sharath Chitturi HT Telugu

30 June 2024, 11:18 IST

google News
    • సీయూఈటీ యూజీ ఫలితాల ప్రకటన జూన్ 30న జరగాల్సి ఉందని సమాచారం. కానీ ఫలితాలు వెలువడవని తెలుస్తోంది. 
సీయూఈటీ యూజీ ఫలితాలు వచ్చేది ఎప్పుడు?
సీయూఈటీ యూజీ ఫలితాలు వచ్చేది ఎప్పుడు?

సీయూఈటీ యూజీ ఫలితాలు వచ్చేది ఎప్పుడు?

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మే నెలలో అండర్ గ్రాడ్యుయేట్/ సీయూఈటీ యూజీ 2024 కోసం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించింది. జూన్ 30న ఫలితాల ప్రకటన ఉంటుందని వార్తలు వినిపించాయి. అయితే ఈ గడువును చేరుకునే అవకాశం లేదని ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్​లో పేర్కొంది.

పైగా ఈసారి సీయూఈటీ యూజీ 2024 ప్రొవిజనల్ ఆన్సర్ కీ, ప్రశ్నపత్రాలు, సమాధానాలు ఇంకా విడుదల అవ్వలేదు.

ఎన్టీఏ మొదట సీయూఈటీ యూజీ ఆన్సర్ కీని అందించి, ఆ తర్వాత అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను ఆహ్వానిస్తుంది. అనంతరం అభ్యంతరాలను పరిశీలించి తుది ఆన్సర్ కీని సిద్ధం చేస్తారు. ఆ తర్వాతే ఫలితాలను ప్రకటిస్తుంది. ఇవన్నీ జరగడానికి కాస్త సమయం పడుతుంది. పైగా ఇంకా ఇప్పటికీ ఆన్సర్​ కీని విడుదల చేయకపోవడంతో.. సీయూఈజీ యూజీ 2024 ఫలితాలు ఆలస్యం అవ్వొచ్చని సమాచారం.

అభ్యర్థుల నుంచి వెలువడే అభ్యంతరాలను సబ్జెక్టు నిపుణులు సమీక్షించి తుది ఆన్సర్ కీని తయారు చేస్తారు. దీనిని ఫలితాలను ప్రకటించడానికి ఉపయోగిస్తారు.

ఈ ఏడాది మే 15, 16, 17, 18, 21, 22, 24, 29 తేదీల్లో కేంద్ర, ఇతర విశ్వవిద్యాలయాల అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష జరిగింది.

ఎన్టీఏ తొలిసారిగా సీయూఈటీ యూజీ పరీక్షకు హైబ్రిడ్ మోడ్​తో నిర్వహించింది. - ఆన్​లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా సీబీటీ), పెన్ అండ్ పేపర్ (సీబీటీ) పరీక్ష.

సీయూఈటీ యూజీ ఆన్సర్ కీ, ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?

  1. స్టెప్​ 1:- ఫలితాలు విడుదలైన తర్వాత exams.nta.ac.in వెబ్​సైటలోకి వెళ్లండి.
  2. స్టెప్​ 2:- కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ లేదా సీయూఈటీ యూజీ ఎగ్జామ్ పేజీని ఓపెన్​ చేయండి.
  3. స్టెప్​ 3:- స్కోర్ కార్డ్, ఆన్సర్ కీ లేదా రెస్పాన్స్ షీట్​ని డౌన్​లోడ్ చేసుకునే లింక్​ను ఓపెన్ చేయండి.
  4. స్టెప్​ 4:- మీ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.
  5. స్టెప్​ 5:- లాగిన్ అవ్వండి. సీయూఈటీ యూజీ 2024 ఆన్సర్ కీ, రిజల్ట్​ని చెక్​ చేసుకోండి.

యూపీఎస్సీ ఫలితాలపై అప్డేట్​..

సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) త్వరలో విడుదల చేయనుంది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు upsc.gov.in అధికారిక వెబ్​సైట్​లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.

యూపీఎస్సీ సీఎస్ఈ ప్రిలిమ్స్ 2024 జూన్ 16న దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో జరిగింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఆబ్జెక్టివ్ టైప్ (మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు) రెండు పేపర్లు, గరిష్టంగా 400 మార్కులు ఉంటాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం