IBPS RRB PO, Clerk exam 2024: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ, క్లర్క్ పరీక్ష 2024 లాస్ట్ డేట్ పొడిగింపు
28 June 2024, 14:34 IST
IBPS RRB: ప్రొబేషనరీ ఆఫీసర్స్, క్లర్క్స్ పోస్ట్ ల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ పై ఐబీపీఎస్ కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జూన్ 27వ తేదీతో ముగిసింది. అయితే, ఆ లాస్ట్ డేట్ ను జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఐబీపీఎస్ శుక్రవారం ప్రకటించింది.
ఐబీపీఎస్ ఆర్ఆర్బీ లాస్ట్ డేట్ పొడిగింపు
IBPS RRB: దేశవ్యాప్తంగా వివిధ బ్యాంక్ ల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్, క్లర్క్స్ పోస్ట్ ల భర్తీ కోసం నిర్వహించే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ 2024 పరీక్షకు అప్లై చేసుకునే లాస్ట్ డేట్ ను పొడిగించారు. ఈ పరీక్ష కోసం ఆన్ లైన్ దరఖాస్తుల నమోదు, ఫీజు/ ఇన్ఫర్మేషన్ ఛార్జీల చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) శుక్రవారం ప్రకటించింది.
జూన్ 30 వరకు..
ఆన్లైన్ దరఖాస్తుల నమోదు, ఫీజు/ ఇన్ఫర్మేషన్ ఛార్జీల చెల్లింపు గడువును 2024 జూన్ 30 వరకు పొడిగించినట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ibps.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. గత షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకు లాస్ట్ డేట్ 2024 జూన్ 27 గా ఉంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 9923 గ్రూప్ 'ఎ'- ఆఫీసర్స్ (స్కేల్-1, 2& 3), గ్రూప్ "బి"- ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టీపర్పస్) పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఎంపిక ప్రక్రియ
ఎంపిక ప్రక్రియలో ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటాయి. ఇదే ప్రక్రియ కింద గ్రూప్ -ఎ- ఆఫీసర్స్ (స్కేల్ -1, 2, 3) నియామకాలకు సంబంధించిన ఇంటర్వ్యూలను నోడల్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు నాబార్డ్, ఐబీపీఎస్ సహకారంతో 2024 నవంబర్ నెలలో సంబంధిత అథారిటీతో సంప్రదించి నిర్వహిస్తాయి.
దరఖాస్తు ఫీజు
ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థుల్లో ఇతరులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఆఫీసర్ (స్కేల్ 1, 2, 3) అభ్యర్థులకు రూ.175, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఈఎస్ఎం/ డీఈఎస్ఎం అభ్యర్థులకు రూ.175 (జీఎస్టీతో కలిపి) దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు.
ఐబీపీఎస్ ఆర్ఆర్బీ 2024 దరఖాస్తు విధానం
- ముందుగా ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ ibps.in ను సందర్శించండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఐబీపీఎస్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
- రిజిస్టర్ చేసుకుని లాగిన్ వివరాలు ఎంటర్ చేయాలి.
- సబ్మిట్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ నింపాలి.
- అవసరమైన సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరాల కోసం హార్డ్ కాపీని భద్రపర్చుకోవాలి.
- మరింత సమాచారం కోసం ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ ibps.in ను చూడండి.