NABARD Recruitment: నాబార్డ్ లో డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లు
NABARD Recruitment: నాబార్డ్ లో (NABARD) లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో nabard.org వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
NABARD recruitment: అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ల భర్తీకి ప్రభుత్వ రంగ సంస్థ ‘నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ - నాబార్డ్ (NABARD)’ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 150 పోస్ట్ లను నాబార్డ్ భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో nabard.org వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
లాస్ట్ డేట్..
నాబార్డ్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 23. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 2 వ తేదీ నుంచి సెప్టెంబర్ 23వ తేదీ వరకు ఆన్ లైన్ లో nabard.org వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. విద్యార్హతలు, అనుభవం, రిజర్వేషన్, అప్లికేషన్ ఫీజు వంటి పూర్తి వివరాల కోసం అభ్యర్థులు nabard.org వెబ్ సైట్ లోని డిటైల్డ్ నోటిఫికేషన్ ను పరిశీలించాలి.
ప్రిలిమ్స్ పరీక్ష
ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించి మూడు ఫేజ్ ల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అవి ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఫేజ్ 1 ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 16వ తేదీన జరగనుంది. ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వారిని 1:25 రేషియలో మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు. మెయిన్స్ క్వాలిఫై అయిన వారిని 1:3 రేషియలో ఇంటర్వ్యూ చేస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకనే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత డిసిప్లిన్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయో పరిమితి 2023 సెప్టెంబర్ 1వ తేదీ నాటికి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో మినహాయింపులు ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు
ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులు రూ. 800 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ. 150 చెల్లించాల్సి ఉంటుంది.