HPCL recruitment: అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ఆఫీసర్, పలు ఇతర పోస్ట్ ల భర్తీకి ప్రధాన ప్రభుత్వ రంగ చమురు సంస్థల్లో ఒకటైన హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 37 పోస్ట్ లను హెచ్పీసీఎల్ భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో hindustanpetroleum.com. వెబ్ సైట్ ద్వారా అప్లై చేయవచ్చు.
హెచ్ పీ సీ ఎల్ లో అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ఆఫీసర్, పలు ఇతర పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 30. విద్యార్హతలు, అనుభవం, రిజర్వేషన్, అప్లికేషన్ ఫీజు వంటి పూర్తి వివరాల కోసం అభ్యర్థులు hindustanpetroleum.com. వెబ్ సైట్ లోని డిటైల్డ్ నోటిఫికేషన్ ను పరిశీలించాలి. ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులు రూ. 1180 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.