IBPS RRB Recruitment 2024: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (RRB) ఆఫీసర్స్ (స్కేల్ -1, 2, 3), ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టీపర్పస్ ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ibps.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ల్లో ఉద్యోగాల కోసం ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు 2024 జూన్ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పేమెంట్ విండో జూన్ 27, 2024తో ముగుస్తుంది. 2024 జూలై 22 నుంచి 27 వరకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ పరీక్షను 2024 ఆగస్టులో నిర్వహిస్తారు.
ఎంపిక విధానంలో ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్ ఎగ్జామ్ ఉంటాయి. ఆఫీసర్ (స్కేల్ 1, 2, 3) పోస్ట్ లకు దరఖాస్తు ఫీజు ఇతరులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఈఎస్ఎం/ డీఈఎస్ఎం అభ్యర్థులకు రూ.175 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించారు.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు.