IBPS PO 2024 Mains: ఐబీపీఎస్ పీఓ 2024 మెయిన్స్ స్కోర్ కార్డ్స్ విడుదల; వెబ్ సైట్ లో మార్క్స్
IBPS PO 2024 Mains results: ప్రొబేషనరీ ఆఫీసర్స్ కోసం నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఐబీపీఎస్ విడుదల చేసింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల కోసం ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ స్కోర్ కార్డ్స్ 2024ను విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు తమ స్కోర్ కార్డ్ లను పొందవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
IBPS PO 2024 Mains score cards: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఇంటర్వ్యూ దశకు అర్హత సాధించిన అభ్యర్థుల బీపీఎస్ పీవో మెయిన్స్ స్కోర్ కార్డ్స్ , మార్కులను శుక్రవారం విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ ibps.in లో ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ స్కోర్ కార్డ్ 2024 (IBPS PO 2024 Mains score cards) ను యాక్సెస్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా తమ స్కోరును చూడవచ్చు.
ఐబీపీఎస్ పీఓ మెయిన్స్: ఎలా చెక్ చేసుకోవాలి
ఐబీపీఎస్ పీఓ స్కోర్ కార్డ్ 2024 (IBPS PO 2024 Mains scorecard) డౌన్ లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు.
- ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ ibps.in ను ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో, “ Scores of candidates shortlisted for interview of CRP PO/MT-XIII” లింక్ పై క్లిక్ చేయాలి.
- తరువాత, మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్ వర్డ్ వంటి మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ని నమోదు చేయండి.
- క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
- మీ ఐబీపీఎస్ పీవో స్కోర్ కార్డ్ 2024 స్క్రీన్ పై కనిపిస్తుంది.
- భవిష్యత్తు రిఫరెన్స్ కొరకు ఆ స్కోర్ కార్డ్ ను సేవ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.