UPSC Prelims Results 2024 : ఇంకొన్ని రోజుల్లో యూపీఎస్సీ ఫలితాలు- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..-upsc prelims results 2024 here is how to download when released ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Upsc Prelims Results 2024 : ఇంకొన్ని రోజుల్లో యూపీఎస్సీ ఫలితాలు- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

UPSC Prelims Results 2024 : ఇంకొన్ని రోజుల్లో యూపీఎస్సీ ఫలితాలు- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu
Jun 30, 2024 07:15 AM IST

UPSC Prelims Results 2024 expected date : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూన్ 16న నిర్వహించిన సీఎస్ఈ ప్రిలిమ్స్ 2024 ఫలితాలను త్వరలో విడుదల చేయనుంది. విడుదలైనప్పుడు ఎలా డౌన్​లోడ్​ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

త్వరలో యూపీఎస్సీ ఫలితాలు- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..
త్వరలో యూపీఎస్సీ ఫలితాలు- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) త్వరలో విడుదల చేయనుంది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు upsc.gov.in అధికారిక వెబ్​సైట్​లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.

యూపీఎస్సీ సీఎస్ఈ ప్రిలిమ్స్ 2024 జూన్ 16న దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో జరిగింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఆబ్జెక్టివ్ టైప్ (మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు) రెండు పేపర్లు, గరిష్టంగా 400 మార్కులు ఉంటాయి.

గత ట్రెండ్స్ ప్రకారం జూలైలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 2023లో యూపీఎస్సీ సీఎస్ఈ ఫలితాలను జూన్ 12న విడుదల చేయగా, పరీక్షను మే 26న నిర్వహించారు.

ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన వారు కీలకమైన యూపీఎస్సీ సీఎస్​ఈ మెయిన్స్ 2024కు అర్హత సాధిస్తారు. అందులో వచ్చే ఫలితాల ఆధారంగా చివరికి ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్​కు వెళతారు.

సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష జనరల్ స్టడీస్ పేపర్ -2లో కనీస అర్హత మార్కులు 33 శాతం. సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష జనరల్ స్టడీస్ పేపర్ -1 మొత్తం అర్హత మార్కుల ఆధారంగా సివిల్ సర్వీసెస్ (మెయిన్ ) పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను రూపొందిస్తామని యూపీఎస్సీ ఇదివరకే పేర్కొంది.

క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 20 నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్​ జరగనుంది.

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వ సర్వీసులు, విభాగాల్లో 1056 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో 40 ఖాళీలను బెంచ్ మార్క్ డిజేబిలిటీ కేటగిరీకి కేటాయించారు.

యూపీఎస్సీ సీఎస్ఈ ప్రిలిమ్స్ 2024 ఫలితాలను ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

  • స్టెప్​ 1:- upsc.gov.in వద్ద యూపీఎస్సీ అధికారిక వెబ్​సైట్​ సందర్శించండి.
  • స్టెప్​ 2:- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) రిజల్ట్ 2024 లింక్​పై క్లిక్ చేయండి.
  • స్టెప్​ 3:- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు అవసరమైన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
  • స్టెప్​ 4:- సబ్మీట్​ బటన్​పై క్లిక్ చేస్తే ఫలితం కనిపిస్తుంది.
  • స్టెప్​ 5:- రిజల్ట్ చెక్ చేసుకుని పేజీని డౌన్​లోడ్ చేసుకోండి.
  • స్టెప్​ 6:- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.

ఈపీఎఫ్ఓ పీఏ అడ్మిట్ కార్డ్స్..

ఈపీఎఫ్ఓ పర్సనల్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్స్ 2024 హాల్ టికెట్లను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం విడుదల చేసింది. ఈ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in నుంచి తమ అడ్మిట్ కార్డులను డౌన్​లోడ్ చేసుకోవచ్చు. యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ పీఏ ఎగ్జామ్ 2024 జూలై 7 న జరగనుంది. ఈ పరీక్షను ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు రెండు గంటల పాటు నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం