UPSC EPFO PA Admit Card: ఈపీఎఫ్ఓ పీఏ అడ్మిట్ కార్డ్స్ ను విడుదల చేసిన యూపీఎస్సీ; ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
UPSC EPFO PA Admit Card 2024: ఈపీఎఫ్ఓ పీఏ ఎగ్జామ్ 2024 అడ్మిట్ కార్డులను యూపీఎస్సీ శనివారం విడుదల చేసింది. ఈ పరీక్ష జూలై 7వ తేదీన జరగనుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డును యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఈపీఎఫ్ఓ పర్సనల్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్స్ 2024 హాల్ టికెట్లను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) శనివారం విడుదల చేసింది. ఈ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in నుంచి తమ అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ పీఏ ఎగ్జామ్ 2024 జూలై 7 న జరగనుంది. ఈ పరీక్షను ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు రెండు గంటల పాటు నిర్వహిస్తారు.
తప్పులుంటే మా దృష్టికి తీసుకురండి
అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in నుంచి ఈ-అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలని యూపీఎస్సీ సూచించింది. ఈ-అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డును చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని, ఏవైనా తేడాలు ఉంటే వెంటనే యూపీఎస్సీ దృష్టికి తీసుకురావాలని సూచించింది. ఇలాంటి సందర్భాల్లో సవరించిన ఈ-అడ్మిట్ కార్డును వీలైనంత త్వరగా అప్ లోడ్ చేసేందుకు కమిషన్ ప్రయత్నాలు చేస్తుందని తెలిపింది. పరీక్ష హాళ్లో ఈ-అడ్మిట్ కార్డు చూపించని అభ్యర్థిని పరీక్ష రాయడానికి అనుమతించబోమని కమిషన్ స్పష్టం చేసింది.
నెగెటివ్ మార్కులు ఉంటాయి.
యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ పర్సనల్ అసిస్టెంట్ పరీక్ష లో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు, బహుళ ఎంపికల సమాధానాలతో ఉంటుంది. అన్ని ప్రశ్నలకు సమాన మార్కులు ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులో మూడింట ఒక వంతు కోత విధిస్తారు. ఒక ప్రశ్నకు సమాధానం మార్క్ చేయకపోతే, ఆ ప్రశ్నకు జరిమానా ఉండదు. రిక్రూట్ మెంట్ టెస్ట్ కు మొత్తం మార్కులు 300 (100% వెయిటేజీ) ఇస్తారు. రిక్రూట్ మెంట్ టెస్ట్ లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను కేటగిరీల వారీగా షార్ట్ లిస్ట్ చేసి వారు దరఖాస్తు చేసుకున్న పోస్టులకు స్కిల్ టెస్ట్ లకు పిలుస్తారు. స్కిల్ టెస్ట్ కు అర్హత సాధించిన అభ్యర్థులను రిక్రూట్ మెంట్ టెస్ట్ లో మెరిట్ ఆధారంగా తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకుంటామని కమిషన్ (UPSC) తెలిపింది.
యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ పీఏ అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్
యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ పీఏ అడ్మిట్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
- ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsconline.nic.in ను ఓపెన్ చేయాలి.
- 'E-Admit Card for Personal Assistant in Employees’ Provident Fund Organisation, 2024’ అనే లింక్ పై క్లిక్ చేయాలి.
- UPSC EPFO Admit Card 2024 అనే లింక్ పై క్లిక్ చేయండి.
- మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయండి (రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రోల్ నెంబరు)
- స్క్రీన్ మీద మీ అడ్మిట్ కార్డు కనిపిస్తుంది. ఆ అడ్మిట్ కార్డును క్షుణ్నంగా చెక్ చేయండి. అనంతరం డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోండి.