Indian Navy Recruitment 2024 apply online : అగ్నివీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది భారత నౌకాదళం. అర్హులైన అభ్యర్థులు joinindiannavy.gov.in ఇండియన్ నేవీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఎంఆర్ మ్యూజీషియన్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 11 జూలై 2024. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ గుర్తించిన బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్జ్యుకేషన్ నుంచి మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 01 నవంబర్ 2003-30 ఏప్రిల్ 2007 (రెండు తేదీలు కలిపి) మధ్య జన్మించి ఉండాలి.
ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్, ఫైనల్ స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా మెరిట్ క్రమం ఆధారంగా నియామకాల ఎంపిక జరుగుతుంది. స్టేజ్ 1 - ప్రిలిమినరీ స్క్రీనింగ్‌కు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం అనేది.. మెట్రిక్యులేషన్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (పీఎఫ్టీ), మ్యూజిక్ స్క్రీనింగ్ టెస్ట్, రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్‌తో కూడిన స్టేజ్-1కు కాల్-అప్ లెటర్ ఇస్తారు. పీఎఫ్టీ, ప్రిలిమినరీ మ్యూజిక్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారు రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
Indian Navy Recruitment 2024 notification : ఖాళీలను బట్టి అన్ని విధాలుగా ఫైనల్ స్క్రీనింగ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులందరి నుంచి మెరిట్ జాబితాను తయారు చేస్తారు. మెరిట్ జాబితా అక్టోబర్ 24 నాటికి వెబ్సైట్లో www.joinindiannavy.gov.in అభ్యర్థుల డ్యాష్‌బోర్డులు అందుబాటులో ఉంటుంది.
అగ్నివీర్స్‌కు నిర్ణీత వార్షిక ఇంక్రిమెంట్‌తో నెలకు రూ.30,000 ప్యాకేజీ చెల్లిస్తారు. వీటితో పాటు రిస్క్, కష్టాలు, దుస్తులు, ట్రావెల్ అలవెన్సులు ఉంటాయి.
ఇండియన్ నేవీలో ఉద్యోగాల కోసం అప్లై చేసుకునేందుకు డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఇండియన్ నేవీ అధికారిక వెబ్సైట్ చూడవచ్చు.
సంబంధిత కథనం