CUET PG 2024 Results: సీయూఈటీ పీజీ 2024 ఫలితాలను ఏప్రిల్ 13, 2024న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) కు హాజరైన అభ్యర్థులు సీయూఈటీ పీజీ అధికారిక వెబ్ సైట్ pgcuet.samarth.ac.in లో ఫలితాలను చూసుకోవచ్చు.
సీయూఈటీ పీజీ 2024 పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ రిజల్ట్ ను ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా తెలుసుకోవచ్చు.
ముందుగా CUET PG అధికారిక వెబ్ సైట్ pgcuet.samarth.ac.in ని ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో కనిపిస్తున్న సైన్ ఇన్ (sign in) లింక్ పై క్లిక్ చేయండి.
స్క్రీన్ పై కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో విద్యార్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
అనంతరం, సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
మీ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా రిజల్ట్ ను చెక్ చేసుకోండి.
తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.
ఈ ఏడాది సీయూఈటీ పీజీ 2024 పరీక్షలకు మొత్తం 7,68, 414 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 5,77, 400 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 3,15, 788 మంది మహిళలు, 2, 61, 608 మంది పురుషులు ఉన్నారు. అలాగే, ఈ సీయూఈటీ పీజీ పరీక్షలకు నలగురు థర్డ్ జెండర్ అభ్యర్థులు హాజరయ్యారు.
సీయూఈటీ పీజీ 2024 (CUET PG 2024) పరీక్షను మార్చి 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 27, 28 తేదీల్లో దేశవిదేశాల్లోని 262 నగరాల్లోని 572 కేంద్రాల్లో కంప్యూటర్ బేస్డ్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10.45 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 12.45 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు, మూడో షిఫ్ట్ సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6.15 గంటల వరకు మూడు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించారు. సీయూఈటీ పీజీ 2024 ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఏప్రిల్ 5న విడుదల చేశారు. ఫైనల్ ఆన్సర్ కీని 2024 ఏప్రిల్ 12న విడుదల చేశారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సీయూఈటీ పీజీ అధికారిక వెబ్ సైట్ ను చెక్ చేయండి.