CUET PG 2024: సీయూఈటీ పీజీ 2024 ఫైనల్ ఆన్సర్ కీ వచ్చేసింది. ఇలా చెక్ చేసుకోండి..-cuet pg 2024 final answer key out at pgcuet samarth ac in download link here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cuet Pg 2024: సీయూఈటీ పీజీ 2024 ఫైనల్ ఆన్సర్ కీ వచ్చేసింది. ఇలా చెక్ చేసుకోండి..

CUET PG 2024: సీయూఈటీ పీజీ 2024 ఫైనల్ ఆన్సర్ కీ వచ్చేసింది. ఇలా చెక్ చేసుకోండి..

HT Telugu Desk HT Telugu
Apr 12, 2024 07:39 PM IST

CUET PG 2024: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏప్రిల్ 12వ తేదీన సీయూఈటీ పీజీ 2024 ఫైనల్ ఆన్సర్ కీ ని విడుదల చేసింది. సీయూఈటీ పీజీ 2024 (CUET PG 2024) పరీక్షలు రాసిన విద్యార్థులు సీయూఈటీ పీజీ అధికారిక వెబ్ సైట్ pgcuet.samarth.ac.in ద్వారా ఫైనల్ ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు.

సీయూఈటీ పీజీ 2024 ఫైనల్ ఆన్సర్ కీ
సీయూఈటీ పీజీ 2024 ఫైనల్ ఆన్సర్ కీ (Shutterstock)

CUET PG 2024 final answer key: సీయూఈటీ పీజీ 2024 ఫైనల్ ఆన్సర్ కీని 2024 ఏప్రిల్ 12న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. 2024 - 25 విద్యా సంవత్సరంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఈ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET PG 2024) కు హాజరైన అభ్యర్థులు సీయూఈటీ పీజీ అధికారిక వెబ్ సైట్ pgcuet.samarth.ac.in లో ఫైనల్ ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు.

ఏప్రిల్ 5న ప్రొవిజనల్ ఆన్సర్ కీ

సీయూఈటీ పీజీ (CUET PG 2024) ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఏప్రిల్ 5న ఎన్టీఏ విడుదల చేసింది. ప్రొవిజనల్ ఆన్సర్ కీ పై అభ్యంతరాలు తెలిపేందుకు 2024 ఏప్రిల్ 7 వరకు గడువు ఇచ్చారు. ఇప్పుడు, తాజాగా ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేశారు. ఈ ఫైనల్ ఆన్సర్ కీ ని డౌన్ లోడ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు.

సీయూఈటీ పీజీ 2024 ఫైనల్ ఆన్సర్ కీ డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా?

సీయూఈటీ పీజీ 2024 (CUET PG 2024) ఫైనల్ ఆన్సర్ కీ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.

  • సీయూఈటీ పీజీ అధికారిక వెబ్ సైట్ pgcuet.samarth.ac.in ను ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న సీయూఈటీ పీజీ 2024 ఫైనల్ ఆన్సర్ కీ లింక్ పై క్లిక్ చేయండి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఫైనల్ ఆన్సర్ కీ కనిపిస్తుంది.
  • ఆ ఫైనల్ ఆన్సర్ కీ (CUET PG 2024 final answer key) ఉన్న పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ఫైనల్ ఆన్సర్ర కీ హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.

దేశవ్యాప్తంగా 190 కి పైగా యూనివర్సిటీల్లో అడ్మిషన్లు

కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సీయూఈటీ పీజీ పరీక్ష (CUET PG 2024)ను నిర్వహిస్తారు. ఈ పరీక్ష కోసం ఈ ఏడాది 4,62,603 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం 190 విశ్వవిద్యాలయాలు ఈ ఏడాది సీయూఈటీ పీజీ స్కోర్లను ఉపయోగించుకోనున్నాయి. వీటిలో 38 కేంద్ర, 38 రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, 9 ప్రభుత్వ సంస్థలు, 105 ప్రైవేటు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మార్చి 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 27, 28 తేదీల్లో దేశవిదేశాల్లోని 262 నగరాల్లోని 572 కేంద్రాల్లో కంప్యూటర్ బేస్డ్ (CBT) పద్ధతిలో సీయూఈటీ పీజీ పరీక్షను నిర్వహించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్టీఏ సీయూఈటీ పీజీ అధికారిక వెబ్ సైట్ ను చూడవచ్చు.

Whats_app_banner