CUET PG 2024 Answer Key : సీయూఈటీ పీజీ ఆన్సర్ కీ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
CUET PG Answer key 2024 : సీయూఈటీ పీజీ 2024 ఆన్సర్ కీ విడుదలైంది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
CUET PG Answer key : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. సీయూఈటీ పీజీ 2024 ఆన్సర్ కీని విడుదల చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్‌కు హాజరైన అభ్యర్థులు.. pgcuet.samarth.ac.in అనే సీయూఈటీ పీజీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
2024 మార్చి 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 27, 28 తేదీల్లో 262 నగరాల్లో ఉన్న 572 వేర్వేరు కేంద్రాల్లో సీబీటీ పద్ధతిలో సీయూఈటీ (పీజీ)ను నిర్వహించింది ఎన్టీఏ.
రిజిస్టర్ చేసుకున్న 4,62,603 మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించారు. సీయూఈటీ పీజీ పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ.. ఈ కింది స్టెప్స్‌ను అనుసరించి ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సీయూఈటీ పీజీ 2024 ఆన్సర్ కీ ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
- స్టెప్ 1:- pgcuet.samarth.ac.in అనే సీయూఈటీ పీజీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి.
- స్టెప్ 2:- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న సీయూఈటీ పీజీ 2024 సైన్ ఇన్ లింక్‌పై క్లిక్ చేయండి.
- స్టెప్ 3:- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు అవసరమైన వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
- How to check CUET PG Answer key : స్టెప్ 4:- సబ్మీట్ బటన్‌పై క్లిక్ చేస్తే మీ ఆన్సర్ కీ కనిపిస్తుంది.
- స్టెప్ 5:- ఆన్సర్ కీ చెక్ చేసి పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.
- స్టెప్ 6:- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి.
CUET PG Answer key download : ఆన్సర్ కీతో పాటు అభ్యంతర విండో కూడా ఓపెన్ అయింది. ప్రాసెసింగ్ ఛార్జీలుగా సవాలు చేసిన ప్రతి ప్రశ్నకు రూ.200/- నాన్ రిఫండబుల్ ఆన్ లైన్ పేమెంట్ చేయడం ద్వారా అభ్యర్థులు సీయూఈటీ పీజీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్సర్ కీపై అభ్యంతరాలను తెలియజేయవచ్చు. కీ ఛాలెంజ్ లింక్ ద్వారా నిర్ణీత సమయంలో చేసిన పెయిడ్ ఛాలెంజ్ లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
అభ్యర్థులు లేవనెత్తిన సవాళ్లను సబ్జెక్టు నిపుణులు పరిశీలించి, ఆ తర్వాత తుది ఆన్సర్ కీని ప్రకటిస్తారు. ప్రకటించిన ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా ఫలితాలను రూపొందిస్తారు. సీయూఈటీ (పీజీ) - 2024 ఫలితాలు/ఎన్టీఏ స్కోర్ ప్రకటించిన తర్వాత ఆన్సర్ కీ(లు)కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు స్వీకరించరని గుర్తు పెట్టుకోవాలి.
సంబంధిత కథనం