GATE 2024: గేట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల; రేపు రిజల్ట్స్ ప్రకటించనున్న ఐఐఎస్సీ-gate 2024 final answer key released at gate2024 iisc ac in gate 2024 results on march 16th ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gate 2024: గేట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల; రేపు రిజల్ట్స్ ప్రకటించనున్న ఐఐఎస్సీ

GATE 2024: గేట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల; రేపు రిజల్ట్స్ ప్రకటించనున్న ఐఐఎస్సీ

HT Telugu Desk HT Telugu
Mar 15, 2024 06:38 PM IST

GATE 2024: గేట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీని బెంగళూరులోని ఐఐఎస్సీ (IISc) విడుదల చేసింది. మాస్టర్ క్వశ్చన్ పేపర్లు, ఆన్సర్ కీల కోసం గేట్ 2024 అధికారిక వెబ్సైట్ gate2024.iisc.ac.in ను చూడండి.

గేట్ ఫైనల్ ఆన్సర్ కీ
గేట్ ఫైనల్ ఆన్సర్ కీ

బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) గేట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీని మార్చి 15న విడుదల చేసింది. అభ్యర్థులు గేట్ 2024 (GATE 2024) అధికారిక వెబ్సైట్ gate2024.iisc.ac.in ద్వారా ఫైనల్ ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు. గేట్ 2024 పరీక్ష 2024 ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో జరిగింది.

yearly horoscope entry point

గేట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీ

గేట్ 2024 ఫలితాలు (GATE 2024 results) మార్చి 16 వ తేదీన విడుదల కానున్నాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ స్కోర్ కార్డ్స్ ను మార్చి 23, 2024 నుంచి గేట్ 2024 అధికారిక వెబ్సైట్ gate2024.iisc.ac.in నుండి పొందవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థుల స్కోర్ కార్డులు మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి.

గేట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీ: ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి

గేట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీ ని చెక్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.

  • గేట్ 2024 అధికారిక వెబ్సైట్ gate2024.iisc.ac.in ను ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో కనిపిస్తున్నగేట్ పేపర్ లింక్ పై క్లిక్ చేయండి.
  • ఆ తరువాత "GATE 2024 MASTER QUESTION PAPERS AND ANSWER KEYS" పై క్లిక్ చేయండి.
  • స్క్రీన్ పై కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఫైనల్ ఆన్సర్ కీని చెక్ చేసుకోండి.
  • భవిష్యత్తు రిఫరెన్స్ కోసం ప్రింట్ తీసుకోండి.

Whats_app_banner