CUET PG 2024: సీయూఈటీ పీజీ పరీక్షకు అప్లై చేయడానికి రేపే లాస్ట్ డేట్; అప్లై చేశారా..?
CUET PG 2024: సీయూఈటీ పీజీ పరీక్ష ద్వారా వివిధ యూనివర్సిటీలు/ ఇన్ స్టిట్యూషన్లలో పీజీ ప్రోగ్రామ్స్ లో అడ్మిషన్లు జరుగుతాయి.
2024-25 విద్యాసంవత్సరానికి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (CUET PG) 2024 కు అప్లై చేయడానికి గడువు రేపటితో ముగుస్తుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానకి జనవరి 24 చివరి తేదీ.
ఈ కాలేజీల్లో..
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర, ఇతర భాగస్వామ్య విశ్వవిద్యాలయాలు/ సంస్థలు/ స్వయంప్రతిపత్తి కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి సీయూఈటీ-పీజీ (CUET PG) పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. ఈ CUET PG 2024 ఎగ్జామ్ కు జనవరి 24 రాత్రి 11:50 గంటల వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తరువాత జనవరి 27వ తేదీ నుంచి జనవరి 29 రాత్రి 11.50 గంటల వరకు విద్యార్థులు తమ అప్లికేషన్లలో ఏవైనా తప్పులుంటే సరి చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఆన్ లైన్ విండో జనవరి 27 ఉదయం ఓపెన్ అవుతుంది.
మార్చి 11 నుంచి..
ఎన్టీఏ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, సీయూఈటీ పీజీ 2024 పరీక్షలు మార్చి 11 న ప్రారంభమవుతాయి. అవి మార్చి 28 వరకు జరుగుతాయి. పరీక్ష కాల వ్యవధి 1 గంట 45 నిమిషాలు ఉంటుంది. సీయూఈటీ పీజీ (CUET PG 2024) పరీక్ష ద్వారా వివిధ యూనివర్సిటీలు/ ఇన్ స్టిట్యూషన్లలో పీజీ ప్రోగ్రామ్స్ లో అడ్మిషన్లు జరుగుతాయి.