CUET PG 2024: సీయూఈటీ పీజీ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు-last date to apply for cuet pg 2024 extended ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cuet Pg 2024: సీయూఈటీ పీజీ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు

CUET PG 2024: సీయూఈటీ పీజీ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు

HT Telugu Desk HT Telugu
Jan 25, 2024 12:17 PM IST

CUET PG 2024: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తు గడువును పొడగించారు. అభ్యర్థులు జనవరి 31 రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

CUET PG 2024: పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ (Common University Entrance Test for Postgraduate CUET PG ) దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పొడిగించింది. అభ్యర్థులు జనవరి 31 రాత్రి 11:50 గంటల వరకు ఆన్ లైన్ లో అధికారిక వెబ్ సైట్ pgcuet.samarth.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఈ గడువు జనవరి 24గా ఉండేది.

కరెక్షన్ విండో..

ఈ పరీక్షకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ జనవరి 31 కాగా, పరీక్ష ఫీజును ఆన్ లైన్ లో చెల్లించడానికి గడువు ఫిబ్రవరి 1 రాత్రి 11:50 గంటల వరకు ఉంటుంది. అలాగే, తమ అప్లికేషన్లలో అవసరమైన మార్పులు చేసే అవకాశం కల్పించే కరెక్షన్ విండో ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు తెరిచి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ నెల 4న సీయూఈటీ పీజీ (CUET PG 2024) ఎగ్జామ్ సిటీ స్లిప్పులు, మార్చి 7న వెబ్ సైట్ ద్వారా అడ్మిట్ కార్డులు అందజేస్తారు.

మార్చి 11 నుంచి పరీక్షలు..

సీయూఈటీ పీజీ 2024 (CUET PG 2024) మార్చి 11 నుంచి 28 వరకు జరగనుంది. ఏప్రిల్ 4న ఆన్సర్ కీని విడుదల చేయనున్నారు. సీయూఈటీ పీజీ పరీక్ష వ్యవధి 1 గంటా 45 నిమిషాలు. మూడు షిఫ్టులు ఉంటాయని, పేపర్ టైమింగ్స్ తర్వాత అభ్యర్థులతో పంచుకుంటారని తెలిపారు. సీయూఈటీ పీజీ 2024 పరీక్ష సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను మార్చి 4న, పరీక్షకు అడ్మిట్ కార్డులను మార్చి 7న జారీ చేయనున్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర భాగస్వామ్య సంస్థలు అందించే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి సీయూఈటీ-పీజీ (CUET PG 2024) ని నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన ఏవైనా సందేహాలు లేదా వివరణల కోసం అభ్యర్థులు ఎన్టీఏ హెల్ప్ డెస్క్ నంబర్ 011 4075 9000కు కాల్ చేయవచ్చు లేదా cuet-pg@nta.ac.in వద్ద ఎన్టీఏకు మెయిల్ చేయవచ్చు.

WhatsApp channel