తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Covid : వామ్మో.. చైనాలో కొత్త వేరియంట్​.. ఇప్పుడు పరిస్థితేంటి?

Covid : వామ్మో.. చైనాలో కొత్త వేరియంట్​.. ఇప్పుడు పరిస్థితేంటి?

Sharath Chitturi HT Telugu

10 July 2022, 19:12 IST

google News
    • Covid : చైనాలో ఒమిక్రాన్​లోని కొత్త సబ్​వేరియంట్​ వెలుగులోకి వచ్చింది. దీనిపై సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి.
చైనాలో ఒమిక్రాన్​ కొత్త సబ్​వేరియంట్​ను గుర్తించిన వైద్యులు!
చైనాలో ఒమిక్రాన్​ కొత్త సబ్​వేరియంట్​ను గుర్తించిన వైద్యులు! (Bloomberg)

చైనాలో ఒమిక్రాన్​ కొత్త సబ్​వేరియంట్​ను గుర్తించిన వైద్యులు!

Covid : ప్రపంచాన్ని గడగడలాండిస్తున్న కొవిడ్​ వేరియంట్లలో ఒమిక్రాన్​ ఒకటి. ఈ ఒమిక్రాన్​లో అనేక సబ్​వేరియంట్లు పుట్టుకొచ్చి, ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా.. చైనాలో ఒక వార్త బయటకొచ్చింది. ఒమిక్రాన్​ సబ్​వేరియంట్​ బీఏ.5.2.1ను గుర్తించినట్టు షాంఘై వైద్య సిబ్బంది వెల్లడించింది.

షాంఘైలోని పుండాంగ్​ ప్రాంతంలో జులై 8న ఈ ఒమిక్రాన్ సబ్​వేరియంట్​ను గుర్తించారు. విదేశాల నుంచి ​వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్​ సబ్​వేరియంట్​ను నిర్ధరించారు.

చైనాలో కొన్ని నెలల క్రితం కేసులు దారుణంగా పెరిగాయి. ముఖ్యంగా షాంఘైలో పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉండేవి. ఇప్పుడిప్పుడే ఆయా ప్రాంతాలు ఊపిరిపీల్చుకుంటున్నాయి. ఈ సమయంలో కొత్త సబ్​వేరియంట్​ వార్త భయపెడుతోంది. అంతేకాకుండా.. ఇలా కొత్త సబ్​వేరియంట్లు పుట్టుకొస్తుంటే.. చైనా 'జీరో కొవిడ్​' పాలసీ నిర్వహణ మరింత క్లిష్టంగా మారుతోంది.

Omicron subvariant : పైగా.. కొవిడ్​ పేరుతో కఠిన ఆంక్షలు విధించడం చైనాకు అలవాటే. ఇక కొత్త సబ్​వేరియంట్​ పుట్టుకురావడంతో.. ఈ నెల 12-14 మధ్య షాంఘై ప్రధాన జిల్లాల్లోని ప్రజలకు వరుసగా రెండుసార్లు కొవిడ్​ పరీక్షలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధపడుతోంది.

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ కేసుల పెరుగుదలకు కారణమవుతున్న ఒమిక్రాన్​ బీఏ.5 సబ్​వేరియంట్​ను తొలుత చైనాలోనే గుర్తించారు. దీనిలో ట్రాన్స్​మిషన్​ రేటు ఎక్కువగా ఉంది. రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకునే శక్తి కూడా దీనికి ఉంది. కాగా.. ఈ ఒమిక్రాన్​ సబ్​వేరియంట్​పై టీకాలు పనిచేస్తుండటం మంచి విషయం.

టాపిక్

తదుపరి వ్యాసం