పడక గదిపైనా ప్రభుత్వం ఆంక్షలు.. ‘ముద్దులు పెట్టుకోవద్దు.. కోరికలు చంపుకోవాలి’-dont kiss is in shanghai covid rules ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Dont Kiss Is In Shanghai Covid Rules

పడక గదిపైనా ప్రభుత్వం ఆంక్షలు.. ‘ముద్దులు పెట్టుకోవద్దు.. కోరికలు చంపుకోవాలి’

HT Telugu Desk HT Telugu
Apr 07, 2022 03:20 PM IST

చైనా: కొవిడ్​ సంక్షోభంతో షాంఘై విలవిలలాడుతోంది. లాక్​డౌన్​ విధించినా పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆంక్షలను కఠినతరం చేసింది అక్కడి ప్రభుత్వం. పడక గదిపైనా రూల్స్​ పెట్టేసింది. ముద్దులు పెట్టుకోవద్దని, కోరికలు చంపుకోవాలని పేర్కొంది.

పడకగదిపై ప్రభుత్వం ఆంక్షలు.. ఎందుకు?
పడకగదిపై ప్రభుత్వం ఆంక్షలు.. ఎందుకు? (Hindustan times telugu/file)

Shanghai covid rules | చైనాలో అమల్లో ఉండే కఠిన ఆంక్షల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు! ఇక కొవిడ్​ కట్టడి పేరుతో ఆంక్షలను ఎన్నో రెట్లు తీవ్రతరం చేసింది అక్కడి ప్రభుత్వం. నిబంధనలతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక ఇప్పుడు పడక గదిపైనా ఆంక్షలు విధించింది చైనా.

ట్రెండింగ్ వార్తలు

చైనాలో ఇటీవల కొవిడ్​ సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. 2020లో కొవిడ్​ పుట్టుకొచ్చినప్పుడు కూడా పరిస్థితులు ఈ విధంగా లేవు! ముఖ్యంగా షాంఘైలో కరోనా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కరోనా కట్టడి కోసం కఠిన లాక్​డౌన్​ను అమలు చేసింది అక్కడి ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

కాగా.. ఇప్పుడు మరో అడుగుముందుకేసిన ప్రభుత్వం.. కొవిడ్​ కట్టడి పేరుతో నేరుగా ప్రజల ఇంట్లోకే వెళ్లింది! పడక గదిపైనా ఆంక్షలు విధిస్తోంది. ఈ బాధ్యత.. స్థానిక ఆరోగ్య కార్యకర్తలకు అప్పగించింది.

China covid 4th wave | ఆరోగ్య కార్యకర్తలు.. మైక్​లు పట్టుకుని షాంఘై వీధుల్లో తిరిగి ప్రచారాలు చేస్తున్నారు. "ఈ రోజు రాత్రికి.. దంపతులు వేరువేరుగా పడుకోవాలి. ముద్దులు పెట్టుకోకూడదు, హగ్​ చేసుకోకూడదు. వేరువేరుగా తినాలి. మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు," అంటూ ప్రచారాల్లో మునిగిపోయారు. ఇది విన్న ప్రజలు షాక్​ అయిపోయారు. ఏంటి ఈ పరిస్థితి అని బాధపడుతున్నారు. కాగా.. ఆరోగ్య కార్యకర్తల ప్రచారాలకు సంబంధించిన దృశ్యాలను కొందరు చైనావాసులు ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. ఇప్పుడది సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

మరోవైపు.. లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడింది. వాటిని సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఈ క్రమంలోనే పలువురు పౌరులు.. ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటి బాల్కెనీలోంచి.. పాటలు పాడుతున్నారు. నినాదాలు చేస్తున్నారు. వీటిని కూడా అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆయా ప్రాంతాలకు డ్రోన్లను పంపించి.. 'కిటికీలు తెరవకండి. పాటలు పాడకండి,' అని ప్రచారాలు చేస్తోంది.

లాక్​డౌన్​తో షాంఘై వీధులు వెలవెలబోతున్నాయి. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, అంబులెన్స్​లు మినహా.. ఇతరులెవరు కంటికి కనిపించడం లేదు.

కొవిడ్​ పేరుతో అరాచకాలు!

Shanghai corona update | మరోవైపు కొవిడ్​ పేరుతో సొంత ప్రజలపై.. చైనా ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. షాంఘైలో కరోనా సోకిన పిల్లలను.. వారి తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తోంది. పిల్లల క్షేమసమాచారాలు సైతం తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతున్నారు. ఫలితంగా తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు.

ఎస్తెర్​ జావో అనే మహిళ.. తన రెండున్నరేళ్ల పిల్లను.. గత నెల 26న షాంఘై ఆసుపత్రికి తీసుకెళ్లింది. జ్వరంతో బాధపడుతున్న ఆ చిన్నారికి కొవిడ్​ పరీక్షలు చేయించారు. అందులో కరోనా పాజిటివ్​గా తేలింది. ఆ వెంటనే జావో, ఆమె భర్తకు కూడా కరోనా పరీక్షలు చేశారు. వారిద్దరికి కూడా పాజిటివ్​ వచ్చింది.

అంతే..! అక్కడితో ఆ కుటుంబం కథ మారిపోయింది. షాంఘైలో పిల్లలకు, తల్లిదండ్రులకు వేరువేరుగా క్వారంటైన్​ ఏర్పాట్లు చేసింది అక్కడి ప్రభుత్వం. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా.. పిల్లలను వారి నుంచి లాగేసుకుని క్వారంటైన్​లో పెడుతోంది. ఎందుకు అని ప్రశ్నిస్తే.. కొవిడ్​ కట్టడి కోసం అని చెబుతోంది.

కానీ.. జావో కూతురికి రెండున్నరేళ్లే. ఆ వయస్సులో పిల్లలను ఒంటరిగా ఎలా వదిలేస్తారు? అందుకే.. అలా చేయవద్దని అధికారులను జావో వేడుకుంది. కానీ ఫలితం దక్కలేదు. రెండున్నరేళ్ల చిన్నారిని.. పిల్లల క్వారంటైన్​ కేంద్రంలో పెట్టడం కష్టం కాబట్టి.. ఆమెను షాంఘై హెల్త్​ క్లీనిక్​కు పంపించారు. జావో, ఆమె భర్తను వేరువేరుగా క్వారంటైన్​లో పెట్టారు.

China corona 4th wave news | అప్పటి నుంచి జావో మనసంతా తన కూతురిపైనే ఉంది. ఆమె క్షేమసమాచారాలు అడుగుతున్నా.. ఎవరు పట్టించుకోవడం లేదు. పిల్లల వివరాల కోసం ఓ గ్రూప్​ చాట్​ ఏర్పాటు చేశారు. పిల్లల వివరాలను అప్పుడప్పుడు వైద్యులు.. అందులో చెబుతూ ఉంటారు.

"మా బిడ్డను చూసి చాలా రోజులైంది. ఫొటోలు లేవు. నా కూతురు ఎలాంటి పరిస్థితుల్లో ఉందోనని భయమేస్తోంది," అని జావో కన్నీరు పెట్టుకుంది.

తల్లిదండ్రులకు దూరమైన పిల్లలు కన్నీరుపెట్టుకుంటున్న దృశ్యాలు.. చైనాలోని సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. అవి చూసిన జావో.. ఇక ఏడుపు ఆపుకోలేకపోతోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్