తెలుగు న్యూస్  /  National International  /  Congress Announces First List Of 124 Candidates For Karnataka Assembly Elections

Congress first list: 124 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన కాంగ్రెస్

HT Telugu Desk HT Telugu

25 March 2023, 8:49 IST

  • Congress first list: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం 124 మంది అభ్యర్థులతో కూడిన ఫస్ట్ లిస్ట్ ‌ను కాంగ్రెస్ ప్రకటించింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం 124 మంది అభ్యర్థులతో కూడిన ఫస్ట్ లిస్ట్ ‌ప్రకటించిన కాంగ్రెస్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం 124 మంది అభ్యర్థులతో కూడిన ఫస్ట్ లిస్ట్ ‌ప్రకటించిన కాంగ్రెస్ (PTI)

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం 124 మంది అభ్యర్థులతో కూడిన ఫస్ట్ లిస్ట్ ‌ప్రకటించిన కాంగ్రెస్

మేలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారం ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

‘రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిటీ ఖరారు చేసిన కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితా ఇదే’ అంటూ పార్టీ అభ్యర్థుల జాబితాను ట్విటర్‌లో షేర్ చేసింది.

తొలి జాబితాలో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పేర్లు ఉన్నాయి. మాజీ సీఎం సొంత నియోజకవర్గమైన మైసూరులోని వరుణ అసెంబ్లీ స్థానం నుంచి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ను కనకపుర నుంచి పోటీకి దింపాలని పార్టీ నిర్ణయించింది.

‘కర్ణాటక శాసనసభకు జరగనున్న ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులుగా పార్టీ ఎన్నికల కమిటీ 124 మందిని ఎంపిక చేసింది’ అని ఏఐసీసీ పత్రికా ప్రకటన తెలిపింది.

యెమకనమర్డి నుంచి కాంగ్రెస్‌ నేతలు సతీష్‌ జార్కిహోళి, బెల్గాం రూరల్‌ నుంచి లక్ష్మీ హెబ్బాల్కర్‌, చితాపూర్‌ నుంచి ప్రియాంక్‌ ఖర్గే, శివాజీనగర్‌ నుంచి రిజ్వాన్‌ అర్షద్‌, గాంధీనగర్‌ నుంచి దినేశ్‌ గుండూరావు, నరసింహరాజు నుంచి తన్వీర్‌ సైత్‌, చామ్‌రాజ్‌పేట నుంచి బీజీ జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ తదితరులు జాబితాలో ఉన్నారు.