CISCE results 2023 : సీఐఎస్సీఈ క్లాస్ 10, 12 ఫలితాలు విడుదల..
14 May 2023, 16:03 IST
CISCE results 2023 : సీఐఎస్సీఈ క్లాస్ 10, 12 ఫలితాలు విడుదలయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
సీఐఎస్సీఈ క్లాస్ 10, 12 ఫలితాలు విడుదల..
CISCE results 2023 : ఐసీఎస్ఈ క్లాస్ 10, ఐఎస్సీ 12 ఫలితాలను ఆదివారం ప్రకటించింది సీఐఎస్సీఈ (కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్). అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులు తన ఫలితాలను http://cisce.org లేదా http://results.cisce.org వెబ్‌సైట్స్‌లో చూసుకోవచ్చు.
ఈ ఏడాది ఐసీఎస్ఈ క్లాస్ 10 పరీక్షలు.. ఫిబ్రవరి 27 నుంచి మార్చ్ 29 వరకు జరిగాయి. మరోవైపు ఐఎస్సీ క్లాస్ 12 పరీక్షలు.. ఫిబ్రవరి 13 నుంచి మార్చ్ 31 వరకు జరిగాయి.
ISC class 12 results 2023 : ఈ ఏడాది జరిగిన ఐసీఎస్ఈ క్లాస్ 10 పరీక్షల్లో మొత్తం మీద 98.94శాతం మంది పాసయ్యారు. హాజరైన అబ్బాయిల్లో 98.71శాతం మంది, అమ్మాయిల్లో 99.21శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 2023లో 53.92శాతం అబ్బాయిలు, 46.08శాతం మంది అమ్మాయిలి పరీక్షకు హాజరయ్యారు. 2022లో పాస్ పర్సెంటేజ్ 99.97శాతంగాను, 2021లో 99.98శాతంగాను ఉంది.
ఇక ఐఎస్సీ క్లాస్ 12 పరీక్షల్లో 96.93శాతం మంది పాసయ్యారు. మొత్తం మీద అబ్బాయిల పాస్ పర్సెంటేజ్ 95.96గాను, అమ్మాయిల పాస్ పర్సెంటేజ్ 98.01గాను ఉంది.
ఫలితాల్ని ఇలా చెక్ చేసుకోండి..
స్టెప్ 1:- www.cisce.org లోకి వెళ్లండి.
ICSE class 10 results : స్టెప్ 2:- రిజల్ట్స్ పేజ్‌లోకి వెళ్లండి. ఐసీఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ రిజల్ట్స్ 2023 లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3:- కోర్స్ కోడ్‌ను ఐసీఎస్ఈ/ ఐఎస్సీగా సెలెక్ట్ చేసి, ఐడెంటిఫికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వంటి లాగిన్ డిటైల్స్ ఇవ్వండి.
స్టెప్ 4:- స్క్రీన్‌పై మీ రిజల్ట్స్ కనిపిస్తాయి.
స్టెప్ 5:- ఆ పేజ్ని డౌన్లోడ్ చేసుకుని, ప్రింటౌట్ తీసుకోండి.
సీబీఎస్ఈ పరీక్షల ఫలితాలు..
CBSE class 12 results : సీబీఎస్ఈ క్లాస్ 10, 12 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. క్లాస్ 12లో మొత్తం మీద 87.33శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని స్పష్టం చేసింది. కొవిడ్ ముందు దశ (2019- 83.40శాతం)తో పోల్చుకుంటే.. ఈ సారి మెరుగైన ఫలితాలు వచ్చాయని వివరించింది.
ఇక సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 93.12% ఉత్తీర్ణత సాధించారు. దేశవ్యాప్తంగా మొత్తం 21,658,05 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకాగా, 20, 167,79 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.