TS Gurukul Recruitment: మరో 1300 గురుకుల ఉద్యోగాలు.. మే నెలాఖరునాటికి నోటిఫికేషన్‌ !-treirb to plan release the another notification for 1300 posts recruitment ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Treirb To Plan Release The Another Notification For 1300 Posts Recruitment

TS Gurukul Recruitment: మరో 1300 గురుకుల ఉద్యోగాలు.. మే నెలాఖరునాటికి నోటిఫికేషన్‌ !

HT Telugu Desk HT Telugu
May 13, 2023 08:06 AM IST

Telangana Gurukulam Jobs Updates 2023: ఇప్పటికే పలు పోస్టుల భర్తీకి గురుకుల బోర్డు నోటిఫికేషన్లు ఇచ్చింది. దరఖాస్తులు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ నెలాఖరునాటికి మరో 1300 పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ గురుకులం ఉద్యోగాలు
తెలంగాణ గురుకులం ఉద్యోగాలు

Telangana Gurukul Recruitment 2023: చాలా రోజులుగా ఎదురుచూస్తున్న గురుకులాల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 9,231 పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ నడుస్తోంది. ఇదిలా ఉండగానే... మే నెలాఖరు నాటికి మరికొన్ని నోటిఫికేషన్లు ఇవ్వాలని రిక్రూట్ మెంట్ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలోని మరో 1,300 పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా 10,675 పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా… ఇందులో ఇప్పటికే 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది ట్రిబ్. వీటికి ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్నది. అయితే మిగిలిన పోస్టుల భర్తీకి మే నెలఖారులో నోటిఫికేషన్లు జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇక ఈసారి గురుకులాల పోస్టుల భర్తీ విషయంలోనూ బోర్డు పలుమార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఓటీఆర్ వ్యవస్థను తీసుకొచ్చింది. టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీ విషయంలోనూ ఓటీఆర్ విజయవంతమైన సంగతి తెలిసిందే. ఒక్కసారి వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలైనప్పుడు ఓటీఆర్ ఎంట్రీ చేస్తే సులభంగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది. ఫొటో, సంతకం, విద్యార్హతలు వంటివి వివరాలను ప్రతిసారి నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా దరఖాస్తు ప్రక్రియ సింపుల్ గా పూర్తి అవుతుంది. ఈ తరహాలోనే గురుకులాల ఉద్యోగాల భర్తీలోనూ ఓటీఆర్ విధానం అమల్లోకి తీసుకొచ్చారు. ఫలితంగా ఎన్ని నోటిఫికేషన్లకు అప్లై చేసుకున్నా.. వ్యక్తిగత వివరాలను మళ్లీ మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. https://treirb.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఓటీఆర్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

మరోవైపు పేపర్ల లీక్ వ్యవహరం నేపథ్యంలో… గురుకుల నియామక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ట్రిబ్‌ చర్యలు చేపట్టింది. పరీక్ష తేదీల ఖరారు, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అవాంఛనీయమైన సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షలను నిర్వహించేందుకు ప్రణాళికలను రూపొందించే పనిలో ఉంది. మిగతా పరీక్షల షెడ్యూల్స్ ను కూడా దృష్టిలో ఉంచుకొని తేదీలను ఖరారు చేస్తోంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత… భారీ సంఖ్యలో గురుకులాలను పెంచింది ప్రభుత్వం. ఇందులో భాగంగా మూడేళ్ల క్రిత‌మే ఆయా గురుకులాల్లో 10 వేల పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కూడా వరుస నోటిఫికేషన్లు ఇస్తోంది. త్వరలోనే వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం