తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cbse 10th Result 2023: సీబీఎస్ఈ టెంత్ ఫలితాల్లో కూడా బాలికలదే పై చేయి..

CBSE 10th Result 2023: సీబీఎస్ఈ టెంత్ ఫలితాల్లో కూడా బాలికలదే పై చేయి..

HT Telugu Desk HT Telugu

12 May 2023, 15:57 IST

  • 10వ తరగతి ఫలితాలను శుక్రవారం సీబీఎస్ఈ విడుదల చేసింది.  దేశవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షల్లో 93.12% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సీబీఎస్ఈ టెంత్ ఫలితాల్లో కూడా బాలికలే పై చేయి సాధించడం విశేషం. తెలంగాణ ఎస్ఎస్సీ బోర్డు పరీక్ష ఫలితాల్లో కూడా బాలికల ఉత్తీర్ణత శాతం బాలుర ఉత్తీర్ణత శాతం కన్నా ఎక్కువ.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

ప్రతీకాత్మక చిత్రం

2023 సంవత్సరం సీబీఎస్ఈ (CBSE) 10వ తరగతి పరీక్షల్లో 93.12% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే, ఇది గత సంవత్సరం ఉత్తీర్ణత శాతం కన్నా 1.28% తక్కువ. 2022 సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల్లో (CBSE 10th Result) 94.4% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

CBSE 10th Result 2023: మెరిట్ లిస్ట్ లేదు..

విద్యార్థుల మధ్య అనవసర, అనారోగ్యకర పోటీని అడ్డుకునే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా మెరిట్ లిస్ట్ ను ప్రకటించడం లేదని సీబీఎస్ఈ వెల్లడించింది. అయితే, వివిధ సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన 0.1% విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లను ఇస్తామని తెలిపింది. కాగా, 2023 సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల్లో బాలుర కన్నా బాలికల ఉత్తీర్ణత శాతం అధికంగా ఉంది. బాలికల్లో 94.25% ఉత్తీర్ణులు కాగా, బాలురలో 92.27% ఉత్తీర్ణలయ్యారు. అలాగే, మొత్తం 1.34 లక్షల మంది విద్యార్థులు కంపార్ట్మెంట్ కేటగిరీలో ఉన్నారు. గతంలో ఫెయిల్ అయి, ఈ సంవత్సరం మళ్లీ పరీక్ష రాసి పాసైనవారిని కంపార్ట్ మెంట్ కేటగిరీలో పెడ్తారు.

CBSE 10th Result 2023: రిజల్ట్ ఇలా చెక్ చేసుకోవచ్చు.

విద్యార్థులు తమ ఫలితాలను results.cbse.nic.in, cbseresults.nic.in. తదితర వెబ్ సైట్స్ లో, ఉమంగ్, డిజిలాకర్ వంటి మొబైల్ యాప్స్ లో చెక్ చేసుకోవచ్చు. ఆయా వెబ్ సైట్స్, మొబైల్ యాప్స్ లో తమ రోల్ నెంబర్ (roll number), స్కూల్ నెంబర్ (school number), అడ్మిట్ కార్డ్ ఐడీ (admit card ID), పుట్టిన రోజు (date of birth) వివరాలను ఫిల్ చేసి రిజల్ట్ తెలుసుకోవచ్చు. ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్ ల ద్వారా కూడా విద్యార్థులు తమ రిజల్ట్ ను చూసుకునే వీలును సీబీఎస్ఈ కల్పించింది.

తదుపరి వ్యాసం